English | Telugu

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు బాలయ్య.. మళ్ళీ అదే తప్పు చేస్తున్న హీరో!

తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలను తమిళ ప్రేక్షకుల కన్నా, తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ఆదరిస్తారని కార్తీ చెబుతుంటాడు. అలాంటి కార్తీ, తన సినిమాల విడుదల తేదీల విషయంలో తప్పటడుగులు వేస్తున్నాడు. దాంతో తెలుగునాట తన సినిమాలకు నష్టం జరుగుతోంది.

కార్తీ గత చిత్రం 'సత్యం సుందరం' తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 28న విడుదలైంది. అయితే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' విడుదలైంది. దాంతో తెలుగులో 'సత్యం సుందరం'కి రావాల్సినంత ఆదరణ దక్కలేదు. నిజానికి ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 'దేవర' ప్రభంజనంలో.. ఈ సినిమా సామాన్యులకు అంతగా చేరువ కాకపోవడంతో, బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు.. ఆ తర్వాత ఓటీటీలో చూసి, ఇంతమంచి సినిమాని సరైన సమయంలో విడుదల చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 'దేవర'తో పోటీగా కాకుండా, సోలోగా విడుదలైనట్లయితే 'సత్యం సుందరం' చిత్రం తెలుగునాట మరిన్ని వసూళ్లను రాబట్టి పెద్ద విజయం సాధించి ఉండేది.

'సత్యం సుందరం' విషయంలో చేసిన తప్పునే, కార్తీ తన నెక్స్ట్ మూవీ విషయంలోనూ చేస్తున్నాడు. కార్తీ నుండి వస్తున్న అప్ కమింగ్ మూవీ 'వా వాతియార్' (Vaa Vaathiyaar). నలన్ కుమారస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే అదే తేదికి నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ-2' వస్తోంది. అసలే బాలయ్య-బోయపాటి కాంబినేషన్, దానికితోడు అఖండ సీక్వెల్ కావడంతో.. ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగునాట 'అఖండ-2' ప్రభంజనంలో వేరే సినిమాలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. దాంతో తెలుగులో కార్తీ 'వా వాతియార్' సినిమాకి నష్టం తప్పేలా లేదు.

తమిళ్ తో పాటు తెలుగు మార్కెట్ కూడా కార్తీకి కీలకం. కానీ, విడుదల తేదీల విషయంలో తెలుగు మార్కెట్ ని పట్టించుకోకుండా రాంగ్ స్టెప్స్ వేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో వస్తున్న పెద్ద సినిమాలకు తగ్గట్టుగా తన రిలీజ్ డేట్స్ ని ప్లాన్ చేసుకుంటే మంచిది. లేదంటే, 'సత్యం సుందరం'కి జరిగినట్టుగా.. మంచి సినిమాలు కూడా ఓటీటీ ప్రశంసలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం