English | Telugu

ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్న విక్రమ్ బ్రదర్స్ 

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ వారం ఏదో ఒక రీ రిలీజ్ థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చిత్రాలు రీ రిలీజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘తమ్ముడు’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రాలెన్నో రీ రిలీజ్ అయి రికార్డులు సృష్టించాయి. ఇక ఇప్పుడు ‘తమ్ముడు’ మూవీని రేపే (ఆగస్ట్ 30) గ్రాండ్ రీ రిలీజ్ చేయబోతోన్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే(సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ మూవీని ఇలా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కంటే ముందే పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ఈ ‘తమ్ముడు’ మూవీ మళ్లీ థియేటర్లోకి రానుంది.

శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ ఫిల్మ్స్‌పై శ్రీమతి మునీశ్వరి సమర్పించు ‘తమ్ముడు’ మూవీ రీ రిలీజ్ హక్కుల్ని ఉత్తరాంధ్రకు చెందిన వైష్ణవి శ్రీ క్రియేషన్స్ బ్యానర్ మీద విక్రమ్ బ్రదర్స్, ఆసన్ సూర్య దేవర చేజిక్కించుకుని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ‘తమ్ముడు’ మూవీ రీ రిలీజ్‌ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

తమ్ముడు 1999లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రీతి జింగానియా ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బి. శివరామకృష్ణ నిర్మించారు. రమణ గోగుల అందించిన సంగీతం ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం