English | Telugu

పవన్ తీన్ మార్ తొలి వారం కలెక్షన్స్

పవన్ కళ్యాణ్ "తీన్ మార్" తొలి వారం కలెక్షన్స్ వివరాలిలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మించిన చిత్రం"తీన్ మార్". హిందీ "లవ్ ఆజ్ కల్" చిత్రానికిది రీమేక్ అన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. "తీన్ మార్" చిత్రం తొలి వారం కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో ఉండటం విశేషం. "తీన్ మార్" కలేషన్స్ ఈ వారం రోజులూ ఎలా ఉన్నాయో రోజు వారీగా మీకందిస్తున్నాం.

తొలిరోజు (గురువారం) - 9.4 cr,

రెండవ రోజు ( శుక్రవారం) - 4.8 cr,

మూడవ రోజు (శనివారం) - 5.2 cr,

నాలుగవ రోజు (ఆదివారం) - 4.1 cr,

ఐదవ రోజు (సోమవారం) - 3.1 cr,

ఆరవరోజు (మంగళ వారం) - 3.1 cr,

ఏడవ రోజు (బుధవారం) - 2.1 cr మొత్తం వారం రోజులకు "తీన్ మార్" వసూలు చేసిన మొత్తం - 31.8 cr. మాకు తెలిసి ఇదొక రికార్డని చెప్పాలి. గతంలో యన్ టి ఆర్ "సింహాద్రి" చిత్రం కానీ, పవన్ కళ్యాణ్ "జల్సా" చిత్రం కానీ, మహేష్ బాబు "పోకిరి" చిత్రం కానీ, రామ్ చరణ్ "మగధీర" చిత్రం కానీ తొలి వారం ఇంత వసూలు చేయలేదు. కారణం "తీన్ మార్" చిత్రం విడుదలైనన్ని థియేటర్లలో ఆ చిత్రాలు విడుదల కాకపోవటమే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.