English | Telugu
ఈ రోజు నందమూరి తారకరత్న జయంతి
Updated : Feb 22, 2024
ఆయనది కల్మషం లేని మనస్తత్వం.ఎదుటివారిని చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తు వాళ్ళ బాగోగులు అడిగే మనసున్న మంచి వ్యక్తి. సినిమాల్లోను రాజకీయాల్లోను ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి. కానీ విధి ఆయన్ని అందరి నుంచి దూరం చేసింది. చిన్న వయసులోనే తన కుటుంబాన్ని,అభిమానులని విడిచేలా చేసింది. ఆయన ఎవరో కాదు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి మనవడు తారకరత్న.ఈ రోజు ఆయన జయంతి. దీంతో మరోసారి ఆయన్ని అందరు గుర్తుచేసుకుంటున్నారు.
2002 లో ఒకటో నెంబర్ కుర్రోడుతో తారకరత్న సినీరంగ ప్రవేశం చేసాడు. నందమూరి వంశానికి తగ్గ నటుడే అనే కితాబుని ప్రేక్షకుల నుంచి అందుకున్నాడు. ఒకేసారి తొమ్మిది సినిమాలకి బుక్ అయ్యి ఇండియన్ సినిమా హిస్టరీ లో మరే ఇతర హీరో అందుకోలేని రికార్డు ని కూడా ఆయన అందుకున్నాడు. ఆయన హీరోగా చేసిన సినిమాలు వేరే ఇతర కారణాల వల్ల ఫెయిల్ అయ్యాయే కానీ నటన విషయంలో మాత్రం ఆయన ఫెయిల్ అవ్వలేదు.మారుతున్న సినిమా సమీకరణాల ప్రకారం హీరోగా చేస్తునే పెర్ఫార్మెన్స్ కి స్కోప్ కి ఉన్న పాత్రలని కూడా చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు.అలాగే తన తాత స్థాపించిన తెలుగు దేశం పార్టీ ద్వారా కూడా రాజకీయాల్లో కి వచ్చి ప్రజలకి సేవ చేద్దామని అనుకున్నాడు. కానీ అనుకోని రీతిలో అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది.
తారకరత్న భార్య పేరు అలేఖ్య రెడ్డి. వారివురికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల జరిగిన తారక రత్న మొదటి వర్ధంతి సందర్భంగా అలేఖ్య చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరి హృదయాల్ని కలిచివేస్తుంది. విచిత్రం ఏంటంటే తారకరత్న తన 40 వ సంవత్సరంలోకి మరో 4 రోజుల్లో అడుగుపెడతాడనగా చనిపోయాడు.అంటే ఫిబ్రవరి 18 న అందర్నీ విడిచి సుదూర దూరాలకి వెళ్ళిపోయాడు.