English | Telugu

పవన్ కళ్యాణ్ పైనే శ్రీలీల ఆశలు..!

గ్లామర్, డ్యాన్సింగ్ స్కిల్స్ తో.. స్టార్స్ పక్కన నటించే ఓ కమర్షియల్ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ శ్రీలీలలో ఉన్నాయి. అయితే కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్లతో వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. దీంతో ఇప్పుడామె తన ఆశలన్నీ పవన్ కళ్యాణ్ పైనే పెట్టుకుంది. (Sreeleela)

'పెళ్లి సందడి' వంటి హిట్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టిన శ్రీలీల.. ఆ తర్వాత 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకోవడమే కాకుండా, వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే వాటిలో 'భగవంత్ కేసరి' తప్ప మిగతా సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ముఖ్యంగా గత మూడు చిత్రాలు 'రాబిన్‌హుడ్', 'జూనియర్', 'మాస్ జాతర' దారుణమైన రిజల్ట్ చూశాయి. దీంతో ఇక శ్రీలీల పనైపోయిందా? టాలీవుడ్ లో ఆమె మెరుపులు మూన్నాళ్ళ ముచ్చటేనా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటికి సమాధానం చెప్పి, తాను స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే.. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మ్యాజిక్ చేయాలి. (Ustaad Bhagat Singh)

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అసలే 'గబ్బర్ సింగ్' కాంబినేషన్, దానికి తోడు ఇటీవల 'ఓజీ'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకొని పవన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. పైగా హరీష్ శంకర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు బాగానే ప్రాధాన్యం ఉంటుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' హిట్ అయ్యి, తన పాత్రకు మంచి పేరు వస్తే.. తెలుగులో శ్రీలీల టైం మళ్ళీ స్టార్ట్ అయినట్లే. చూద్దాం మరి 'ఉస్తాద్ భగత్ సింగ్'తో హిట్ అందుకుంటుందేమో.

Also Read: మరోసారి 'రాజా సాబ్' వాయిదా.. క్లారిటీ వచ్చేసింది!

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం