English | Telugu

స్పిరిట్ మూవీ లాంచ్.. ఈ స్టార్ వారసులను గుర్తుపట్టారా..?

మెగాస్టార్ క్లాప్ తో స్పిరిట్ మూవీ లాంచ్
ప్రత్యేక ఆకర్షణగా ఇద్దరు స్టార్ వారసులు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'స్పిరిట్' (Spirit). ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ, నవంబర్ 23న మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో ప్రారంభమైంది. ఈ మూవీ లాంచ్ సందర్భంగా విడుదల చేసిన ఫోటోలలో.. ఇద్దరు స్టార్ వారసులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్పిరిట్ మూవీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కుమారుడు రిషి, మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్ వర్క్ చేస్తున్నారు. స్పిరిట్ సినిమా లాంచ్ ఫోటోలలో ఈ ఇద్దరూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డైరెక్టర్ మారుతి క్షమాపణలు!

మాటల మాంత్రికుడిగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా త్రివిక్రమ్ కి ఎంతో పేరుంది. అలాంటిది ఆయన కుమారుడు రిషి.. మరో డైరెక్టర్ సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుండటం విశేషం. మరి రిషి భవిష్యత్తులో తన తండ్రిలా క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడో లేక తన గురువులా రా ఎమోషన్స్ తో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడో చూడాలి.

ఇక హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం సహజం. కానీ, రవితేజ తనయుడు మాత్రం సందీప్ రెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. నిజానికి రవితేజ కూడా తన సినీ ప్రయాణాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ గానే మొదలుపెట్టడం విశేషం. మరి మహాధన్ కూడా తండ్రి బాటలోనే భవిష్యత్తులో హీరోగా ఎంట్రీ ఇస్తాడో లేక డైరెక్టర్ గా సర్ ప్రైజ్ చేస్తాడో చూద్దాం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.