English | Telugu
అదితిరావు హైదరీని సిద్ధార్థ్ ఏమని పిలుస్తారో తెలుసా?
Updated : Apr 8, 2023
తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా గుర్తుండిపోయే నటనను కనబరిచారు అదితిరావు హైదరీ. ఆమె సెలక్ట్ చేసుకునే పాత్రలను బట్టే, ఆమె ఎంత సున్నితమనస్కురాలో అర్థం చేసుకోవచ్చని అంటుంటారు ఫిల్మ్ క్రిటిక్స్. ఆల్రెడీ పెళ్లయి డైవర్స్ తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు అదితిరావు హైదరీ. ఇప్పుడు ఆమె సిద్ధార్థ్‌తో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని అదితి, సిద్ధార్థ్ ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ, వాళ్లిద్దరూ తరచూ కలిసి కనిపిస్తుండటంతో ఈ విషయం గురించి నార్త్ టు సౌత్ అంతటా డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ సందర్భంగా సిద్ధార్థ్ తన ప్రేయసిని ముద్దుపేరుతో పిలిచారు. అదేంటన్నదే ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న విషయం. తన జూబ్లీ ప్రీమియర్‌కు వచ్చిన ఫ్రెండ్స్ అందరితో కలిసి అదితిరావు హైదరీ ఓ ఫొటో తీసుకుని నెట్లో షేర్ చేశారు. అందులో సిద్ధార్థ్ కూడా ఉన్నారు.
అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ ఇద్దరూ నవ్వులు కురిపిస్తున్నారు. ఆ ఫొటోను షేర్ చేస్తూ ``అత్యంత దగ్గరైన వాళ్లం. థాంక్యూ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు`` అంటూ పోస్ట్ పెట్టారు అదితిరావు హైదరీ. అంతే కాదు, కొందరిని తాను మిస్ అవుతున్న విషయాన్ని కూడా ఇందులో రాశారు. దీనికి సిద్ధార్థ్ రాసిన కామెంట్ కూడా వైరల్ అవుతోంది. ``అదులాగా ఇంకెవరూ ఉండరు`` అని కామెంట్ చేశారు సిద్ధార్థ్. అదు అంటే ఇంకెవరో కాదు, అదితిరావు హైదరీ. సిద్ధార్థ్ ఆమెను అదు అని పిలుస్తారని ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. దాంతో అందరూ హ్యాపీగా కామెంట్లు పోస్టు చేస్తున్నారు. లవ్లీ జోడీ అంటూ మరికొందరు పెడుతున్న కామెంట్లకు మురిసిపోతున్నారు అదితిరావు హైదరీ. సిద్ధార్థ్, అదితిరావు హైదరీ కలిసి తెలుగులో మహా సముద్రం సినిమాలో నటించారు. ఇందులో అదితిరావుని మోసం చేసే పాత్రలో నటించారు సిద్ధార్థ్.