English | Telugu

సిద్ధార్థ రాజ్ కుమార్ ఫస్ట్ లుక్

సిద్ధార్థ రాజ్ కుమార్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సిద్ధార్థ రాజ్ కుమార్ ఎవరనేగా మీ అనుమానం. సిద్ధార్థ రాజ్ కుమార్ మరో నట వారసుడని చెప్పాలి. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త అయిన రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా, యంగ్ రెబెల్ స్టార్ గా ప్రభాస్ బాగానే రాణిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సోదరుడు (పిన్నిగారబ్బాయి) సిద్ధార్థ రాజ్ కుమార్ కూడా హీరోగా సినీ పరిశ్రమలోకి అడిగుపెట్టనున్నాడు. అయితే ప్రభాస్ లాగా డైరెక్టుగా తెలుగు సినిమాలోకి రాకుండా కన్నడ సినీ రంగం నుండి సిద్ధార్థ రాజ్ కుమార్ హీరోగా సిని పరిశ్రమలోకి రావటం విశేషం.

కన్నడంలో ప్రముఖ నిర్మాత యస్.వి.బాబు తమ యస్.వి.ప్రొడక్షన్స్ పతాకంపై, సిద్ధార్థ రాజ్ కుమార్ హీరోగా, గౌతం పట్నాయక్ దర్శకత్వంలో, తెలుగు,తమిళ, మళయాళ భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే టాకీ పార్టు పూర్తి చేసుకుంది. సిద్ధార్థ రాజ్ కుమార్ ఫొటో తొలిసారి మీడియాముందుకు వచ్చింది. సిద్ధార్థ రాజ్ కుమార్ భవిష్యత్తులో మంచి హీరో అయ్యే అవకాశలున్నాయని సినీ వర్గాలు అంటున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.