English | Telugu

అవతార్‌ రేంజ్‌లో శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. గేమ్ ఛేంజర్ అవుతుందా..?

ఒకప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ అంటే ఓ బ్రాండ్. అప్పట్లోనే భారీ సినిమాలు తీసి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. 'జెంటిల్ మేన్', 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'అపరిచితుడు', 'రోబో' వంటి సినిమాలతో సంచలనం సృష్టించాడు. అలాంటి శంకర్ కొన్నేళ్లుగా వెనకబడిపోయాడు. ముఖ్యంగా గత రెండు చిత్రాలు 'భారతీయుడు 2', 'గేమ్ ఛేంజర్' దారుణంగా నిరాశపరిచాయి. దాంతో ఇక శంకర్ పని అయిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో తాను గ్లోబల్ స్థాయిలో సత్తా చాటే సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తానని ప్రకటించి షాకిచ్చాడు శంకర్.

వేల్పారి అనే ఓ భారీ సినిమాని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఈవెంట్ లో పంచుకున్నాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం వేల్పారి పైనే ఉందని, అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నానని చెప్పాడు. ఒకప్పుడు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ రోబో అయితే, ఇప్పుడు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ వేల్పారి అని అన్నాడు. గ్లోబల్ అప్పీల్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నానని, ఈ చిత్రం తన కెరీర్‌ కి గేమ్ ఛేంజర్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలోని ప్రతి అంశం గ్రాండ్‌ గా ఉంటుందని.. గ్లోబల్ స్టాండర్డ్స్‌లో 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌', 'అవతార్‌' రేంజ్‌లో భారీ వీఎఫ్‌ఎక్స్‌తో విజువల్‌ వండర్‌గా వేల్పారి చిత్రాన్ని రూపొందించాలని ఆశ పడుతున్నట్లు శంకర్‌ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం శంకర్ తో సినిమా అంటేనే నిర్మాతలు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. అలాంటిది శంకర్ ఏకంగా 'అవతార్‌' రేంజ్‌ సినిమా కోసం కలలు కంటున్నాడు. మరి ఆయన కల నెరవేరి.. వేల్పారితో కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.