English | Telugu

సరైనోడు సీక్వెల్ లో హీరో ఎవరో తెలుసా! అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి షాక్! 

-సరైనోడు సీక్వెల్ లో హీరో ఎవరు
-రామ్ చరణ్, అల్లు అర్జున్ తో మల్టీస్టారర్
-అల్లు అరవింద్ కోరిక ఏంటి!
-అసలు సరైనోడు సీక్వెల్ ఉందా!

కొన్ని చిత్రాలు అంత తేలికగా అభిమానులు,ప్రేక్షకుల మస్తిష్కం నుంచి దూరమవ్వవు. అఫ్ కోర్స్ ఆ మూవీ హీరో, మేకర్స్ కూడా సేమ్ సిట్యువేషన్ లోనే ఉంటారు. అలాంటి వైబ్రేషన్ ని సంపాదించుకున్న మూవీ 'సరైనోడు'(Sarrainodu). హీరోగా ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)రేంజ్ ని మరింతగా పెంచిన చిత్రం కూడా. ఈ విషయాన్నీచాలా సందర్భాల్లో అల్లు అర్జునే చెప్పుకొచ్చాడు. దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu)రేంజ్ కూడా సరైనోడుతోనే మరింతగా పెరిగింది. సమ్మర్ కానుకగా 2016 ఏప్రిల్ 22 న మండు వేసవిలో రిలీజై మండు వేసవికి సైతం చెమటలు పట్టించేలా కలెక్షన్ల తుఫాన్ ని సృష్టించింది.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉందనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతుంది. దీంతో సీక్వెల్ కి సంబంధించిన అప్ డేట్ ఏమైనా వస్తుందేమో అని అభిమానులు ఎదురుచూస్తు వస్తున్నారు. రీసెంట్ గా సరైనోడు ని నిర్మించిన అల్లు అరవింద్ సీక్వెల్ గురించి మాట్లాడటం జరిగింది. తన అప్ కమింగ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతు సరైనోడు సీక్వెల్ ని తెరకెక్కించడం జరిగితే నా బ్యానర్ లోనే ఉంటుందని చెప్పాడు. ఒక రకంగా అభిమానులకి ఈ విషయంపై ఆనందంగానే ఉన్నా, కొత్త డౌట్స్ ని కూడా తీసుకొచ్చింది. అల్లు అరవింద్ మాటల్లో తెరకెక్కించడం ఖాయమైతే కనుక అని వచ్చింది. అంటే ఇంకా అధికారకంగా డిసైడ్ అవ్వలేదనే అర్ధం. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో సీ క్వెల్ పై చర్చ జరుగుతుంది.


కానీ ఒక్కటి మాత్రం నిజం. అల్లు అర్జున్ ఒక సందర్భంలో మాట్లాడుతు తక్కువ సమయంలో ఫక్తు కమర్షియల్ సినిమా చేస్తానని, బోయపాటి తోనే చేస్తానని వెల్లడి చేసాడు. దీంతో అల్లు అరవింద్ నుంచి అభిమానులు దాకా సరైనోడుకి సీక్వెల్ చెయ్యమని కోరుతున్నారు. దీంతో సీక్వెల్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. అల్లు అర్జున్, బోయపాటి మధ్య మంచి అనుబంధం ఉండటం కూడా అభిమానుల కోరికకి బలాన్ని ఇస్తుంది.

Also read: ఇది కదా కావాల్సింది చరణ్.. చికిరి కి భలే అర్ధం చెప్పావు

ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు తమ కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సందర్భంలోనే అల్లు అరవింద్ మాట్లాడుతు రామ్ చరణ్(Ram Charan)అల్లు అర్జున్(Allu Arjun) తో భారీ మల్టి స్టారర్ తెరకెక్కించాలనేది తన కోరిక అని చెప్పాడు. ఈ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇద్దరు మాస్ హీరోలు కాబట్టి సరైనోడు సీక్వెల్ లోనే ఇద్దరు చేస్తే బాగుంటుందనే కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.