English | Telugu

పెళ్లయిన ఐదు రోజులకే.. వైరల్ గా మారిన సమంత పోస్ట్..!

డిసెంబర్ 1న రాజ్ నిడిమోరుతో పెళ్ళి
ఐదు రోజులకే సమంత ఏం చేసిందంటే..?

డిసెంబర్ 1న దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రముఖ హీరోయిన్ సమంత వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్ళైన కొత్తలో ప్రొఫెషనల్ లైఫ్ కంటే, పర్సనల్ లైఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు చాలామంది. కానీ, సమంత మాత్రం.. పెళ్ళైన ఐదు రోజులకే షూటింగ్ లో పాల్గొని సర్ ప్రైజ్ చేశారు. (Samantha Ruth Prabhu)

కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించిన సమంత.. ప్రస్తుతం తన స్వీయ నిర్మాణంలో 'మా ఇంటి బంగారం' అనే సినిమా చేస్తున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ ఫీమేల్-సెంట్రిక్ ఫిల్మ్ కి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. (Maa Inti Bangaram)

Also Read: నిన్న అఖండ.. నేడు రాజా సాబ్.. షాక్ ల మీద షాక్ లు!

'ఓ బేబీ' తరువాత సమంత-నందిని రెడ్డి కలయికలో వస్తున్న 'మా ఇంటి బంగారం' మూవీ షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శుక్రవారం(డిసెంబర్ 5) ఈ చిత్ర షూటింగ్ లో సమంత పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా మేకప్ రూమ్ లో డైరెక్టర్ నందిని రెడ్డితో కలిసి దిగిన ఫోటోని సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లయిన ఐదు రోజులకే షూటింగ్ లో పాల్గొన్న సమంత డెడికేషన్ పట్ల నెటిజెన్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

కాగా, సమంత సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నుండి వస్తున్న రెండో సినిమా ఇది. మొదటి సినిమా 'శుభం' ఈ ఏడాది మే నెలలో విడుదలై మంచి విజయం సాధించింది. అందులో సమంత ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వడం విశేషం.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.