English | Telugu

మెగా హీరోల ప‌రువు తీసిన‌... సైమా

సంపూతో మెగా హీరోలు పోటీ ప‌డితే ఎలా ఉంటుంది?? అందులోనూ ఓ అవార్డు కోసం..?? సంపూ రేంజు పెరిగిందనుకోవాలా, లేదంటే మెగా హీరోల స్థాయి దిగ‌జారింద‌నుకోవాలా?? అనే ప్ర‌శ్న త‌ప్ప‌కుండా ఉద‌యిస్తుంది. అలా మెగా హీరోల‌తో `సైమా` ఆటాడేసుకొంది. టోట‌ల్‌గా మెగా ఫ్యామిలీ ప‌రువు తీసింది. దక్షిణాదిన‌ సినిమా రంగానికి సంబంధించి ప్ర‌తి ఏడాదీ ‘సైమా’ అవార్డ్స్ ని ఇస్తోంది.

2014 సంవ‌త్స‌రానికి గానూ సైమా త‌న నామినీ లిస్ట్ విడుద‌ల చేసింది. ఈ లిస్టు చూసి మెగా ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఎందుకంటే బెస్ట్ డెబ్యూ హీరోల లిస్టులో సాయి ధరమ్ తేజ్ (పిల్లా నువ్వు లేని జీవితం), వరుణ్ తేజ్ (ముకుంద‌) పేర్లు క‌నిపించాయి. ఆ ప‌క్క‌నే సంపూర్ణేష్ బాబు (హృద‌య‌కాలేయం) పేరు ఉండ‌డం...మెగా ఫ్యాన్స్‌ని విస్మ‌య‌ప‌రిచింది. ఈ అవార్డు కోసం సంపూతో వీళ్లు పోటీ ప‌డాలా?? అంటూ ముక్కున వేలేసుకొంది.

ఒక వేళ సంపూకే ఈ అవార్డు ద‌క్కితే తమ హీరోల ప‌రువేంగానూ.. అంటూ మెగా ఫ్యాన్స్ త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఈ వేడుక‌కు మెగా హీరోలు హాజ‌ర‌వుతారా? అనే ప్ర‌శ్న కూడా త‌లెత్తుతోంది. మ‌రి మెగా హీరోలు దీన్ని త‌మ ప్రెస్టేజియ‌స్ ఇష్యూగా తీసుకొంటారో, లేదంటే స్పోర్టీవ్‌గా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.