English | Telugu

కుక్కల ఆపరేషన్ కి 100 ఇవ్వండంటున్న నటి   

పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రేణు దేశాయ్ సూపర్ గా నటించిందనే ప్రశంసల్ని అందుకుంది.రేణు తాజాగా నాకు డబ్బులు కావాలంటూ వార్తల్లోకి ఎక్కింది.

రేణు దేశాయ్ పక్కా జంతు ప్రేమికురాలు. తన ఇంట్లో ఎప్పుడు పెట్స్ అండ్ పిల్లులు ఉంటాయి. జంతువులకి ఏ చిన్న బాధ వచ్చినా రేణు తట్టుకోలేదు. ఒక మూడు కుక్కలకి ఆపరేషన్ చెయ్యాలని ఒక సంస్థ రేణు దేశాయ్ దృష్టికి తెచ్చింది. అందుకు గాను యాభైవేలు ఖర్చవుతుందని తెలిసి రేణు ముప్పయ్ వేలు ఇచ్చిందంట మిగతా ఇరవై వేలు కావాలని రేణు తన సోషల్ మీడియా వేదిక ద్వారా తన ఫాలోవర్స్ ని అడుగుతుంది. ఒక్కొక్కరు 100 రూపాయిలు సహాయం చేసిన సరిపోతుందని అంటుంది.
కాగా రేణు దేశాయ్ పవన్ నుంచి విడిపోయినా కూడా మెగా ఫ్యామిలి లో జరిగే ఫంక్షన్స్ కి అకిరా, ఆద్య లని పంపిస్తు వస్తుంది. కానీ ఇప్పుడు వరుణ్ పెళ్ళికి మాత్రం పవన్ పిల్లలిద్దరు వెళ్ళలేదు. రేణు దేశాయ్ వాళ్ళిద్దర్నీ ఎందుకు పంపించలేదో అని మెగా ఫాన్స్ అనుకుంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.