English | Telugu

నేషనల్ క్రష్ రష్మిక ఈ నెల 12 నుంచి అక్కడ బిజీ!

మొన్న వచ్చిన యానిమల్ మూవీతో తనని నేషనల్ క్రష్ అని ఎందుకు అంటారో రష్మిక మరోసారి నిరూపించింది. ఆ మూవీలో గీతాంజలి క్యారెక్టర్లో రణబీర్ లవర్ గా భార్యగా ఆమె ప్రదర్శించిన నటన భారతీయ సినీ ప్రేక్షకులందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యానిమల్ విజయోత్సాహాంలో ఉన్న రష్మిక మళ్ళీ తన నటనతో ప్రేక్షకులని మెస్మరైజ్ చెయ్యడానికి రెడీ అవుతుంది.

రష్మిక ఈ నెల పన్నెండు నుంచి పుష్ప 2 షూటింగ్ లో పాల్గొనబోతుంది. 2021 లో వచ్చిన పుష్ప పార్ట్ 1 లో శ్రీవల్లి క్యారక్టర్ లో రష్మిక ప్రదర్శించిన నటనని ఎవరు మర్చిపోలేరు. ఆ మూవీ చివరలో తన కోరిక ప్రకారం పుష్ప ని పెళ్లిచేసుకున్న శ్రీవల్లీ ఇప్పుడు పుష్ప 2 లో మరింతగా తన హవాని కొనసాగించబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు ఈ వార్తలని సోషల్ మీడియాలో చూసిన చాలా మంది రష్మిక మరోసారి శ్రీవల్లి క్యారెక్టర్లో తన సత్తాని చాటబోతుందని అంటున్నారు.


రష్మిక పుష్ప 2 తో పాటు గా మహిళా సాదారికతను వివరించే ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీలో కూడా నటిస్తుంది.ఆ మూవీ లో రష్మిక టైటిల్ రోల్ లో నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి చి.ల.సౌ,మన్మధుడు 2 లాంటి చిత్రాలకి దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.