English | Telugu

తప్పించుకుందామని అనుకున్నా తప్పించుకోలేకపోయిన రష్మిక 

యానిమల్(Animal)పుష్ప 2 (Pushpa 2),చావా(Chhaava)ఈ మూడు చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.దీంతో రష్మిక ఇప్పుడు ఇండియన్ చిత్ర సీమలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈ నెల 30 న ఈద్ కానుకగా బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan)తో కలిసి ‘సికందర్'(Sikandar)మూవీతో థియేటర్స్ లోకి అడుగుపెట్టింది.

ఇప్పుడు ఈ మూవీ డివైడ్ టాక్ ని తెచ్చుకొని భారీ పరాజయం దిశగా వెళ్తుంది.దీంతో రష్మిక తెలుగులో తప్పించుకున్నా,బాలీవుడ్ లో మాత్రం తప్పించుకోలేకపోయిందనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.నితిన్(Nithiin)'రాబిన్‌హుడ్’మూవీ ఈ నెల 28 న రిలీజ్ అయ్యింది.ఇందులో హీరోయిన్ గా తొలుత రష్మిక నే.ఈ మేరకు మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా వచ్చింది.కానీ ఆ తర్వాత రష్మిక తప్పుకోవడంతో శ్రీలీల ఆ ప్లేస్ లోకి వచ్చింది.ఇప్పుడు ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనని అందుకుంటుంది.కలెక్షన్స్ కూడా పెద్గగా రావడం లేదు.దీంతో రాబిన్ హుడ్ ని వదులుకొని రష్మిక మంచి పని చేసిందనే కామెంట్స్ వినిపించాయి.

కానీ ఇప్పుడు 'సికందర్’భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.తొలిరోజు కేవలం 26 కోట్లు మాత్రమే రాబట్టి సల్మాన్, రష్మిక అభిమానులకి షాక్ ని ఇచ్చింది.హ్యాట్రిక్ హిట్స్ తర్వాత రష్మిక ఎదుర్కున్న మొదటి ప్లాప్ కూడా సికందరే.దీంతో రాబిన్ హుడ్ నుంచి తప్పించుకున్నా సికందర్ కి బుక్ అయ్యిందనే కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం రష్మిక చేతిలో కుబేర,ది గర్ల్ ఫ్రెండ్, 'తమ' అనే చిత్రాలు ఉన్నాయి.వీటిలో కుబేర జూన్ 20 న విడుదల కానుండగా మిగిలిన రెండు చిత్రాలు కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.