English | Telugu

వాళ్ళ పేర్లు చెబితే నన్ను చంపేస్తారు.. రష్మిక వ్యాఖ్యలు వైరల్!

-రష్మిక సంచలన వ్యాఖ్యలు
-ది గర్ల్ ఫ్రెండ్ పై భారీ అంచనాలు
-వాళ్ళ పేర్లు చెప్తే చంపేస్తారు
-విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ అయ్యిందా!


సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటు పాన్ ఇండియా నటీమణిగా చెలామణి అవుతు వస్తుంది రష్మిక(Rashmika Mandanna).. తను కన్నడ భామ అనే విషయం మర్చిపోయి, రష్మిక తమ ఇండస్ట్రీ కి చెందిన నటి అని మేకర్స్, ప్రేక్షకులు సగర్వంగా చెప్తున్నారు. దీన్నిబట్టి రష్మిక ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నెల 7న మారోమారు సిల్వర్ స్క్రీన్ పై తన హవాని చాటడానికి 'ది గర్ల్ ఫ్రెండ్'(The Girl friend)అనే మూవీతో రాబోతుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో చిత్ర విజయంపై రష్మిక అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది.

రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మిక తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తూ ఉంది. రీసెంట్ గా ఎక్స్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుంటే ఒక అభిమాని రష్మిక తో 'మీ బెస్ట్ గర్ల్ ఫ్రెండ్' ఎవరు అనే ప్రశ్నని సంధించడం జరిగింది. స్పందించిన రష్మిక 'నా కంటూ కొంత మంది బెస్టిస్ ఉన్నారు. పబ్లిక్ లో వాళ్ళ పేర్లు చెబితే చంపేస్తారు అంటు సమాధానం చెప్పింది. ఇప్పడు రష్మిక చెప్పిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు, పేరు చెప్తే చంపేసే అంతా బెస్టిస్ ఎవరని అభిమానులు, నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.

Also read: ఈమె మన శివగామినేనా! అంతా రామ్ గోపాల్ వర్మ మాయ

రష్మిక కి ఇటీవల సహ నటుడు విజయ్ దేవరకొండ(Vijay deverakonda)తో ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో ఆ ఇద్దరు ఒక ఇంటివాళ్ళు కాబోతున్నారని అభిమానులు సంబరాలలో మునిగిపోయారు. కానీ ఈ విషయాన్నీ రష్మిక, విజయ్ అధికారకంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రష్మిక తో పాటు చిత్ర బృందం గర్ల్ ఫ్రెండ్ విజయంపై పూర్తి నమ్మకంతో ఉంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.