English | Telugu

రష్మి రెచ్చిపోవ‌డం ఖాయ‌మా?

జ‌బ‌ర్‌ద‌స్త్‌తో అందాల యాంక‌ర్‌గా పేరు తెచ్చుకొంది రష్మి! ఈ ఒక్క పోగ్రామ్‌తోనే కుర్ర‌కారుని కిర్రెక్కించింది. మాట‌ల గార‌డీ ఏం చేయ‌లేక‌పోయినా, జ‌స్ట్ త‌న డ్ర‌స్ సెన్స్‌తో.. సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచిపోయింది. అన‌సూయ‌లానే ఈ పోగ్రాంతోనే సినిమావాళ్ల దృష్టిలో ప‌డింది. రష్మికి అవ‌కాశాలు వెల్లు వెత్తుతున్నాయి. ఈసారి ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో గుంటూర్ టాకీస్‌లో న‌టిస్తోంది ర‌ష్మి.

ఇది వ‌ర‌కు వెండి తెరపై అడ‌పాద‌డ‌పా క‌నిపించినా అప్పుడంత పాపుల‌ర్ కాలేదు. ఇప్పుడు జ‌బ‌ర్‌ద‌స్త్ ద్వారా వ‌చ్చిన పాపులారిటీని అందిపుచ్చుకొని ఈసినిమాతో వెండి తెర‌పై తిష్ట వేయాల‌నుకొంటోంది రష్మి. అందుకే... గుంటూర్ మిర్చిలానే ఈ సినిమాలో ఘాటుగా క‌నిపించ‌బోతోంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌మ‌ర్షియ‌ల్ హిట్ ద‌క్కించుకోని ప్ర‌వీణ్ స‌త్తారు ఈసినిమాలో రష్మి, శ్ర‌ద్దాదాస్ పాత్ర‌ల‌తో ఆ హంగుల్ని అద్దాడు. శ్ర‌ద్దాదాస్ ఎలాగూ హాట్ బ్యూటీనే. ఆమెకు పోటీగా ర‌ష్మి కూడా త‌న అంద‌చందాల‌తో మ‌త్తెక్కించింద‌ట‌.

ఈ సినిమాలో బ‌య‌ట‌కు వ‌చ్చిన కొన్ని స్టిల్స్ చూసి రష్మి ఇలానే రెచ్చిపోతే... వెండి తెర‌పై ఓ వెలుగు వెల‌గ‌డం ఖాయ‌మ‌నుకొంటున్నారు. ర‌ష్మి కూడా ఆ దిశ‌గానే అడుగులు వేస్తోంది. మ‌రి గుంటూర్ టాకీస్‌లో ఎంత ఘాటుగా క‌నిపిస్తుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.