English | Telugu

రూ.5 కోట్ల పారితోషికంతో ఛార్మి సంచ‌ల‌నం!

తెలివంటే ఛార్మిదే. పైసా పారితోషికం తీసుకోకుండా సినిమాలో యాక్ట్ చేసింది. నిర్మాత అనే హోదా అనుభ‌వించింది. ఇప్పుడు ఆ సినిమాకి గానూ రూ.5 కోట్ల పారితోషికం అందుకొని ఓ స‌రికొత్త సంచ‌లం సృష్టించింది. పూరి - ఛార్మిల కాంబినేష‌న్లో రూపుదిద్దుకొన్న సినిమా జ్యోతిల‌క్ష్మి.

ఈసినిమాకి ఛార్మి పైసా పారితోషికం తీసుకోకుండా భాగ‌స్వామిగా చేరిపోయింది. అటు పూరి కూడా ఫ్రీగానే చేశాడు. ఎందుకంటే ఈ సినిమాలో త‌న‌కూ వాటా ఉంది. ఈ సినిమాలో ఛార్మి త‌ప్ప మ‌రో స్టార్ ఎవ‌రూ లేరు. అందుకే ఈ సినిమాని అతి త‌క్కువ బ‌డ్జెట్‌లో పూర్తి చేయ‌గ‌లిగాడు పూరి. ఇప్పుడు ఈ సినిమాని మొత్తంగా రూ.15 కోట్ల‌కు అమ్మేశార‌ట‌. అంటే ఛార్మి త‌న వాటాగా రూ.5 కోట్లు ద‌క్కించుకొంద‌న్న‌మాట‌.

ఈ ఉత్సాహంతో జ్యోతిల‌క్ష్మీ 2 కూడా చేసేయ‌డానికి ఛార్మి రెడీ అయిపోతోంది. రూ.5 కోట్ల పారితోషికం వ‌స్తే ఎవ‌రు ఆగుతారు. కాక‌పోతే పూరినే ఖాళీగా లేడు. ఛార్మితో జ్యోతిల‌క్ష్మి 2 తీయాలంటే మూడేళ్ల‌యినా ప‌డుతుంది. పూరి అంత బిజీ మ‌రి. అయితే జ్యోతిల‌క్ష్మితో అత్య‌ధిక పారితోషికం అందుకొన్న క‌థానాయిక‌గా ఛార్మి రికార్డ్ సృష్టించిన‌ట్టే. మిగిలిన హీరోయిన్లంతా ఈ ఫార్ములా పాటిస్తే... బాగుంటుందేమో.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.