English | Telugu

రానా నాయుడు సీజ‌న్‌ 2 ట్రైల‌ర్.. ఈసారి అంతకుమించి..!

2023లో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన సిరీస్ 'రానా నాయుడు' ఎంతటి ఆద‌ర‌ణ‌ను పొందిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొన‌సాగింపుగా ‘రానా నాయుడు సీజ‌న్‌2’ మ‌న ముందుకు రానుంది. గ‌త‌సారి కంటే క‌ఠిన‌మైన, చీక‌టి పొర‌ల‌ను క‌లిగిన అంశాలు ఇందులో ఉండ‌బోతున్నాయి. (Rana Naidu Season 2)

సీజన్1 లో సెల‌బ్రిటీల స‌మ‌స్య‌ల‌ను గుర్తించి, వాటిని ప‌రిష్క‌రించే వ్య‌క్తిగా రానా మ‌న‌కు కనిపించాడు. అయితే సీజ‌న్‌2లో మాత్రం త‌న కోసం, త‌న కుటుంబం కోసం పోరాడాల్సి వ‌స్తుంది. సీజ‌న్1 కంటే సీజ‌న్‌2లో మ‌రింత తీవ్ర‌త‌ర‌మైన ప‌రిస్థితులు కనిపించనున్నాయి. రానా చిట్ట‌చివ‌ర‌గా ఓ ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌నిని ఫిక్స్ చేయాల‌ని భావిస్తాడు. ఆ ప్ర‌య‌త్నంలో అత‌ను చివ‌రి వ‌ర‌కు చేరుకుంటాడు. అది విజ‌య‌వంత‌మైతే అత‌ని కుటుంబ భ‌విష్య‌త్తు బాగుంటుంది. అయితే రౌఫ్ రూపంలో అనుకోని తుపాన్ ఎదుర‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య యుద్దం మొద‌ల‌వుతుంది. ఈ యుద్ధంలో రానా పైచేయి సాధించాడా లేదా? అనేది సీజన్-2 చూసి తెలుసుకోవాలి.

రానా నాయుడు సీజ‌న్‌2 జూన్‌13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో ఆక‌ట్టుకునే యాక్ష‌న్‌, హై ఓల్టేజీ ఫ్యామిలీ డ్రామా ఉండ‌నుంది. ఈ సిరీస్ ను క‌ర‌ణ్ అన్షుమ‌న్ క్రియేట్ చేసి సుప‌ర్ణ్ వ‌ర్మ‌, అభ‌య్ చోప్రాల‌తో క‌లిసి తెర‌కెక్కించారు. సుంద‌ర్ అరోన్‌, లోకో మోటివ్ గ్లోబ‌ల్ నిర్మాణంలో రూపొందింది. అర్జున్ రాంపాల్, సూర్వీన్ చావ్లా, కృతి ఖర్భందా, సుషాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, మరియు డినో మోరియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.