English | Telugu

రామోజీని బాగా వాడేస్తున్న రాజ‌మౌళి

బాహుబ‌లిలో ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధిప‌తి రామోజీరావు వాటా కూడా ఉంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. `ఈనాడు` ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ సినిమాకీ ఇవ్వ‌నంత ప్ర‌మోష‌న్ `బాహుబ‌లి`కి ఇస్తుండాన్ని చూస్తుంటే.. ఆ సంగ‌తి ఎవ్వ‌రికైనా అర్థ‌మైపోతుంది. బాహుబ‌లికి సంబంధించిన ఏ చిన్న విష‌యాన్నీ `ఈనాడు` వ‌ద‌ల‌డం లేదు. ప్ర‌తిరోజూ ఏదో ఓ క‌థ‌నంతో `బాహుబ‌లి`ని ఆకాశాన్ని ఎత్తేయ‌డానికి త‌న‌వంతు కృషి చేస్తోంది. రామోజీరావుని ఈ సినిమాలో భాగ‌స్వామిగా చేయ‌డం వెనుక‌... రాజ‌మౌళి వేసిన స్కెచ్ ఇది అనుకొంటే పొర‌పాటే. జ‌క్క‌న్న అంత‌కంటే పెద్ద స్కెచ్ వేశాడ‌ని టాలీవుడ్ టాక్‌.

బాహుబ‌లి లాంటి సినిమా రామోజీ ఫిల్మ్‌సిటీలోనే తీయ‌డం సాధ్య‌ప‌డుతుంది. పైగా ఒక‌టా రెండా...? దాదాపు మూడేళ్ల ప్రాజెక్టు. అక్క‌డ భారీ సెట్లు వేయాలి. ఇఫ్రాస్ట‌క్చ‌ర్ చాలా కావాలి. దాదాపుగా స‌గం బ‌డ్జెట్ ఈ సెట్టింగులు, ఫిల్మ్‌సిటీ అద్దెల‌కే స‌రిపోతాయి. అక్క‌డే రాజ‌మౌళి భారీ స్కెచ్ వేశాడు. రామోజీరావుని పార్ట‌న‌ర్ చేసి అత‌ని ఖాతాలో... సెట్టింగులు ఖ‌ర్చు వేసేశాడు. అంటే ఫిల్మ్‌సిటీలో వేసే ఏ సెట్టుకీ... డ‌బ్బులు క‌ట్ట‌క్క‌ర్లేద‌న్న‌మాట‌. అది.. రామోజీరావు వాటా కింద‌కు వ‌చ్చేస్తుంది. సో... `బాహుబ‌లి` సినిమాకి అత్యంత భారమైన సెట్టింగుల ఖ‌ర్చు ఇలా త‌గ్గించుకొన్నాడు. ఇంతా పోజేస్తే.. ఈ సినిమా రామోజీ వాటా 20 శాతానికి మించి లేద‌ని టాక్‌.

ఎప్పుడైతే ఈ సినిమాలో వాటా ద‌క్కిందో... అప్ప‌టి నుంచీ ఈ సినిమాని సొంత సినిమాకంటే మిన్న‌గా ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తోంది ఈనాడు. నెలరోజుల క్రింద‌టి నుంచే బాహుబ‌లి ప్ర‌మోష‌న్ల‌ను మొద‌లెట్టేసింది. రాజ‌మౌళి ఇంట‌ర్వ్యూకి ఫుల్ పేజీ కేటాయించి అంద‌రికీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే... ఈనాడు చ‌రిత్ర‌లో ఫుల్ పేజీ ఇంట‌ర్వ్యూ ద‌క్కింది ఒక్క రాజ‌మౌళికి మాత్ర‌మే. ఇక మీద‌టా.. ఈనాడులో ఇలానే ఫుల్ పేజీ ఇంట‌ర్వ్యూలు దర్శ‌న‌మిచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. మొత్తానికి రామోజీని అడ్డుపెట్టుకొని సెట్టింగుల ఖ‌ర్చు తగ్గించుకొన్న జ‌క్క‌న్న‌.. ఇటు ఈనాడుని అడ్గుపెట్టుకొని ఎడాపెడా ప్ర‌మోష‌న్లూ చేయించుకొంటున్నాడు. బుర్రంటే అలా ఉండాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.