English | Telugu

చులకనవుతున్న చిరంజీవి !

రాజకీయాల్లోకి వెళ్లాక మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కొంచెం డామేజ్ అయినప్పటికీ.. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. ఈ మధ్య ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యారు కాబట్టి.. ఇండస్ట్రీలో గౌరవ మర్యాదలు కూడా మళ్లీ పెరిగాయి. చిరంజీవి వస్తానంటె ఆడియో ఫంక్షన్లు మాత్రమే కాదు.. అవార్డ్ ఫంక్షన్లు కూడా డేట్స్ మార్చుకుంటారు. అంతటి ప్రభావం కలిగిన మెగాస్టార్ చిరంజీవి.... మొన్న "ఎవడు" ఆడియో ఫంక్షన్‌లో హాజరుకావడం "తన అదృష్టంగా భావిస్తున్నాను" అంటూ మాట్లాడడం మెగా అభిమానులకు అయోమయాన్ని కలిగించింది.

అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయన "సీక్రెట్" అనే పుస్తకాన్ని ప్రస్తావించడం ఆశ్చర్యానికిలోను చేసింది. "మనం ఏదైతే జరగాలని బలంగా కోరుకుంటామో.. అది కచ్చితంగా జరిగితీరుతుంది. నేను ఈ ఆడియో ఫంక్షన్‌కు హాజరు కాగలనో లేదోనని చాలా భయపడ్డాను. కానీ హాజరుకావాల్సిందేనని మనసులో మాత్రం బలంగా అనుకొన్నాను" అందుకే ఇది జరిగింది" అని ఈ సందర్భంగా చిరంజీవి ఎంతో ఉద్వేగంతో ప్రసంగించారు. "ఫలానా రోజయితేనే నాకు కుదురుతుంది" అని తన పి.ఎతో చెప్పించినా పనైపోయేదాని గురించి.. చిరంజీవి ఇంత ఇదిగా మాట్లాడడం ఆయన అభిమానులందరికీ ఎబ్బెట్టుగా అనిపించింది!

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.