English | Telugu

రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్..ఇందుకు కారణం గేమ్ చేంజర్ సినిమానే 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నుంచి సుమారు రెండు సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్న మూవీ గేమ్ చేంజర్(game changer).సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతున్న ఈ మూవీకి శంకర్(shankar)దర్శకుడు.దీంతో గేమ్ చేంజర్ పై మెగా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.పైగా తమన్ సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజైన నాలుగు పాటలు,టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో అంచనాలు అంబరాన్ని తాకాయని కూడా చెప్పవచ్చు.

రీసెంట్ గా చరణ్ అభిమాని 'రిప్ లెటర్' అనే టైటిల్ ని హెడ్డింగ్ గా పెట్టి గేమ్ చేంజర్ టీం కి ఒక లెటర్ రాయడం జరిగింది.'గౌరవనీయులైన గేమ్ చేంజర్ గారికి నేను అనగా ఈశ్వర్ చరణ్ అన్న ఫ్యాన్ చింతిస్తూ రాయునది ఏమనగా,సినిమాకి ఇంకా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది.మరి మీరు ఇంకా ఎలాంటి ట్రైలర్ అప్ డేట్ ఇవ్వలేదు.కనీసం అభిమానుల ఎమోషన్స్ ని కూడా పట్టించుకోవటంలేదు.ఈ నెలాఖరుకల్లా,ట్రైలర్ అప్ డేట్ ఇవ్వకపోతే,న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చెయ్యకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానని తెలియచేస్తున్నాని రాసుకొచ్చాడు.ఇప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.మరి ఈ విషయంపై ప్రొడ్యూసర్ దిల్ రాజు(dil raju)గాని,రామ్ చరణ్ గాని ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ(Kiara Advan)హీరోయిన్ గా చేస్తుండగా అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.