English | Telugu

మెగాస్టార్ చిరంజీవికి వర్మ క్షమాపణలు..!

మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పారు. శివ రీ-రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవికి.. వర్మ థాంక్స్ చెప్పడంతో పాటు, సారీ కూడా చెప్పడం విశేషం.

నాగార్జున హీరోగా నటించిన 'శివ' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు రామ్ గోపాల్ వర్మ. 1989లో విడుదలైన ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలవడమే కాకుండా, టాలీవుడ్ క్లాసిక్ ఫిలిమ్స్ లో ఒకటిగా పేరు పొందింది. అలాంటి 'శివ' చిత్రం ఈ నవంబర్ 14న రీ రిలీజ్ అవుతోంది.

శివ మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న సందర్భంగా మూవీ టీంకి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. "శివ చూసి నేను ఆశ్చర్యపోయాను. అది సినిమా కాదు.. ఓ విప్లవం.. ఓ ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకి కొత్త నిర్వచనం ఇచ్చింది. నాగార్జున ఇంటెన్స్ యాక్టింగ్ అద్భుతం. అమల, రఘువరన్ ప్రతి ఒక్కరూ పాత్రలకు ప్రాణం పోశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజన్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. కెమెరా యాంగిల్స్, లైట్, సౌండ్ అన్నీ కొత్తగా అనిపించాయి. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని నాకు అప్పుడే అనిపించింది. శివ రీ రిలీజ్ సందర్భంగా టీమ్ కి నా శుభాకాంక్షలు." అని అన్నారు.

శివ సినిమాని, తనని చిరంజీవి ప్రశంసించడంపై రామ్ గోపాల్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు. "ధన్యవాదాలు చిరంజీవి గారూ. నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే ఈ సందర్భంగా హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు." అని వర్మ రాసుకొచ్చారు.

గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆయన చిరంజీవికి క్షమాపణలు చెప్పి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.