English | Telugu

'పెద్ది' కొత్త రిలీజ్ డేట్.. మామూలు ప్లాన్ కాదిది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'పెద్ది'(Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను మార్చి 27న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే కొంచెం షూటింగ్ పెండింగ్ ఉండటంతో వాయిదా పడిందని ఇటీవల వార్తలొచ్చాయి. అంతేకాదు కొత్త విడుదల తేదీ మే లేదా జూన్ అని మొదట, ఆ తర్వాత ఏకంగా దసరాకు వాయిదా పడినట్లు ప్రచారం జరిగింది. అయితే అవేవీ నిజం కాదని తేలిపోయింది.

తాజాగా 'పెద్ది' కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2026 ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో పొడవాటి జుట్టు, గుబరు గడ్డంతో రా లుక్ లో చరణ్ కనిపించిన తీరు ఆకట్టుకుంది.

Also Read: మార్చి 26న 'ఉస్తాద్ భగత్ సింగ్'

ఏప్రిల్ 30న విడుదల అనేది మంచి నిర్ణయం. మొదటిరోజు ఏప్రిల్ 30 గురువారం. రెండో రోజు మే డే కావడంతో నేషనల్ హాలిడే ఉంటుంది. ఆ తర్వాత శని, ఆదివారాలు. ఇలా నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది. ఇప్పటికే పెద్దిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే పాజిటివ్ టాక్ తోడైతే.. భారీ ఓపెనింగ్స్ వస్తాయి అనడంలో సందేహం లేదు.

టైటిల్ మార్చాలని రోడ్డు ఎక్కిన బ్రాహ్మణులు.. ఎందుకు అలా చేస్తున్నారు

తెలుగు సినిమా ప్రేమికులు 'మనోజ్ బాజ్ పేయి'(Manoj Bajpayee)పేరు చెప్పగానే చాలు, విలక్షణమైన పెర్ ఫార్మెన్స్ కి పేటంట్ హక్కు తీసుకున్న యాక్టర్ కదా అంటారు. పైగా తన గురించి మనం ఏం చెప్పబోతున్నామో పూర్తిగా వినకుండానే సదరు మూవీ లవర్స్ ఎంతో ఆనందంతో 'సత్య మూవీలోని బీకు మాత్రే, ప్రేమకథ లోని శంకరం, అల్లు అర్జున్  హ్యాపీ లోని డిసిపి అరవింద్, పవన్ కళ్యాణ్  పులి లోని ఏ ఐ సలీం, వేదం లోని రహీముద్దీన్ ఖురేషి క్యారెక్టర్స్ లలో మనోజ్ బాజ్ పేయి ఒక రేంజ్ లో  చేసాడు కదా అని స్టార్ట్ చేస్తారు.ఆయన పెర్ ఫార్మెన్స్ కి   అంత రేంజ్ ఉంది.