English | Telugu

షూటింగ్ లో హీరోయిన్ సంయుక్త మీనన్ కి గాయాలు!

- గాయాలపాలైన సంయుక్త మీనన్
- 'ది బ్లాక్ గోల్డ్' కోసం డూప్ లేకుండా భారీ ఫైట్లు
- గాయాలను సైతం లెక్క చేయకుండా షూటింగ్ కొనసాగింపు

తన అందం, అభినయంతో ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి మారిపోయింది. ప్రస్తుతం ఆమె 'ది బ్లాక్ గోల్డ్'(The Black Gold) అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది.

'ది బ్లాక్ గోల్డ్' కోసం డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తుంది సంయుక్త. ఈ క్రమంలోనే ఆమెకు గాయాలు అయ్యాయి. అయితే గాయాలను సైతం లెక్క చేయకుండా షూటింగ్ కొనసాగిస్తోంది.

ఈ మూవీలో సంయుక్త మీనన్ చేస్తున్న యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలవనున్నాయట. సంయుక్త కెరీర్ లో 'ది బ్లాక్ గోల్డ్' ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుందని మూవీ టీమ్ నమ్మకంగా ఉంది.

కొందరు హీరోలే డూప్స్ సహాయంతో యాక్షన్ సీన్స్ చేస్తుండగా.. సంయుక్త గాయాలను సైతం లెక్క చేయకుండా యాక్షన్ సీన్స్ చేస్తుండటంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాగా 'ది బ్లాక్ గోల్డ్' చిత్రాన్ని యోగేష్ కెఎంసి రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్ భాగస్వామ్యంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో 'ది బ్లాక్ గోల్డ్' సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

టైటిల్ మార్చాలని రోడ్డు ఎక్కిన బ్రాహ్మణులు.. ఎందుకు అలా చేస్తున్నారు

తెలుగు సినిమా ప్రేమికులు 'మనోజ్ బాజ్ పేయి'(Manoj Bajpayee)పేరు చెప్పగానే చాలు, విలక్షణమైన పెర్ ఫార్మెన్స్ కి పేటంట్ హక్కు తీసుకున్న యాక్టర్ కదా అంటారు. పైగా తన గురించి మనం ఏం చెప్పబోతున్నామో పూర్తిగా వినకుండానే సదరు మూవీ లవర్స్ ఎంతో ఆనందంతో 'సత్య మూవీలోని బీకు మాత్రే, ప్రేమకథ లోని శంకరం, అల్లు అర్జున్  హ్యాపీ లోని డిసిపి అరవింద్, పవన్ కళ్యాణ్  పులి లోని ఏ ఐ సలీం, వేదం లోని రహీముద్దీన్ ఖురేషి క్యారెక్టర్స్ లలో మనోజ్ బాజ్ పేయి ఒక రేంజ్ లో  చేసాడు కదా అని స్టార్ట్ చేస్తారు.ఆయన పెర్ ఫార్మెన్స్ కి   అంత రేంజ్ ఉంది.