English | Telugu

"3 ఇడియట్స్" నేను చెయ్యలేను- రామ్ చరణ్

"3 ఇడియట్స్" నేను చెయ్యలేను అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. వివరాల్లోకి వెళితే శంకర్ దర్శకత్వంలో, విజయ్, జీవా, శ్రీరామ్ హీరోలుగా, ఇలియానా హీరోయిన్ గా, జెమినీ ఫిలిం సర్క్యూట్స్ నిర్మిస్తున్న చిత్రం"స్నేహితుడు" ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో, ఆడియో విడుదల చేసిన అనంతరం రామ్ చరణ్ పై విధంగా అన్నారు."అమీర్ ఖాన్ వంటి హీరో మాత్రమే చేయగలిగిన పాత్ర అది. అలాంటి పాత్ర నన్ను చేయమంటే నేను చేయలేను" అని అన్నారు రామ్ చరణ్.

అంటే తాను ప్రస్తుతం తన సినీ భవిష్యత్తు తొలి రోజుల్లోనే ఉన్నాననీ, అలాంటి ప్రయోగాత్మక పాత్రలు ఇప్పుడే చెయ్యను అని ఆయన పరోక్షంగా చెప్పారన్నమాట. అది కూడా నిజమే కదా. మెగా స్టార్ ఏకైక కుమారుడిగా, నట వారసుడిగా తన అభిమానులను దృష్టిలో ఉంచుకుని, ప్రయోగాల జోలికి వెళ్ళకుండా ప్రస్తుతం కమర్షియల్ సినిమాల్లోనే నటించటమే ముఖ్యం కదా...!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.