English | Telugu

"గౌరవం"లో వరలక్ష్మి

"గౌరవం"లో వరలక్ష్మి హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే "గగనం" ఫేం రాధామోహన్ దర్శకత్వంలో యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నటించబోయే "గౌరవం" చిత్రంలో వరలక్ష్మి హీరోయిన్ గా నటించనుందని తెలిసింది. ఈ వరలక్ష్మి ఎవరూ అంటే నటి రాధిక భర్త, నటుడు శరత్ కుమార్ కూతురే ఈ వరలక్ష్మి. ఈ వరలక్ష్మి విద్యాధికురాలు. నటన మీద ఆసక్తితో తల్లిదండ్రుల అనుమతితో వరలక్ష్మి సినీ రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది.

ముందుగా తమిళ సినీ రంగంలో తెరంగేట్రం చేసింది ఈ వరలక్ష్మి. ఈమెతో "గౌరవం" చిత్ర నిర్మాత మంతనాలు జరుపుతున్నారట. అదే గనక ఒ.కె. అయితే గౌరవం" చిత్రంలో వరలక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. అన్నట్టు ఈ "గౌరవం" చిత్రానికి ప్రముఖ నటుడు, సినీ రచయిత తనికెళ్ళ భరణి మాటలు వ్రాయటం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.