English | Telugu

నాతో పోటీపడే స్థాయి మరెవరికీ లేదు: రాజేంద్రప్రసాద్‌

కళాకారుల జీవితాల్లో మంచి మార్పు కోసమే ‘మా’ అధ్యక్షుడిగా పోటీచేస్తున్నానని నటుడు రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. సేవ చేయడానికి మనసు, సంకల్పం ఉంటే చాలునని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, ఆస్తులు వెంట రావని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా హాస్యంతో సినీ కళామాతల్లికి సేవచేశానన్నారు. ఇదొక ధర్మ యుద్ధమని, ఈ ధర్మయుద్ధంలో మంచి చేయడానికి రావడమే పాపమా? అని రాజేంద్రప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పోటీపడే స్థాయి మరెవరికీ లేదని వ్యాఖ్యానించారు. తెలుగు వాడిగా పుట్టిన దౌర్భాగ్యం వల్లే.. అంతర్జాతీయ సినిమా చేసినా గుర్తింపు రాలేదని రాజేంద్రప్రసాద్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.