English | Telugu

ఇస్రో రాకెట్ కి బాహుబలి పేరు.. ఆకాశంలోకి పంపించాక జరిగింది ఇదే

-బాహుబలి కి అరుదైన గౌరవం
-ఇస్రో రాకెట్ కి బాహుబలి పేరు
-రాజమౌళి ధన్యవాదాలు
-ఆకాశంలోకి వెళ్ళాక జరిగింది ఇదే

తెలుగు సినిమా కీర్తినే కాకుండా భారతీయ సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రాలు బాహుబలి పార్ట్ 1 , పార్ట్ 2 . మొదటి భాగం థియేటర్స్ లో అడుగుపెట్టినప్పట్నుంచే బాహుబలి పేరుపై చాలా సంస్థలు,హోటల్స్ లాంటివి వెలిసాయి. పర్వదినాల సమయంలో కూడా తమ ఇష్టదైవాలైన దేవతామూర్తుల విగ్రహాలని బాహుబలి(Baahubali)అనే పేరుతో కొలుచుకున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అంతలా బాహుబలి పేరు భారతీయుల మనోఫలకాల్లో భద్రంగా దాగి ఉంది. రీసెంట్ గా బాహుబలి కి మరో అరుదైన గౌరవం దక్కింది.

భారతదేశ ప్రతిష్టకి తలమానికంగా నిలిచే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISro)రీసెంట్ గా ఎల్ వీఎం 3 -ఎల్ 5 రాకెట్ ని రూపొందించింది. ఈ రాకెట్ కి బాహుబలి అనే పేరుని నిర్ణయించారు. నిర్ణయించడమే కాదు గగనతలంలోకి బాహుబలి రాకెట్ సాయంతో కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్ 3 ని పంపించి తమ ప్రయత్నంలో విజయం సాధించించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజమౌళి(SS Rajamouli)సోషల్ మీడియా వేదికగా ఇస్రో కి ధన్యవాదాలు తెలుపుతు 'అంతరిక్ష పరిశోధనలో మన సాంకేతిక బలాన్ని ప్రదర్శించిన క్షణాలు ఎంతో గర్వకారణం. బరువు, బలం కారణంగా ఆ రాకెట్ కి బాహుబలి అని ప్రేమగా పేరుని నిర్ణయించారు. ఈ విషయంలో మా బాహుబలి టీం మొత్తం సంతోషించిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసాడు.

Also Read : అల్లు అర్జున్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. అసలు సౌండ్ లేదేంటి..!

ఆగష్టు 15,1969 లో ఇస్రో స్థాపించబడింది. అంతరిక్ష సాంకేతికతని ఉపయోగించుకోవడంలో ఇస్రో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు ఉపగ్రహ ప్రయోగ వాహనాలైన పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌విలను తయారు చేస్తుంది.భారతదేశం మరియు మానవాళికి బాహ్య అంతరిక్ష ప్రయోజనాలని అందించడం కూడా సంస్థ ప్రధాన లక్ష్యం. పూర్తి పేరు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం