English | Telugu

సినిమాకి అన్యాయం చేస్తున్నారు..ఐ బొమ్మ కి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్  

తెలుగు

సినిమా రంగానికి తీరని ద్రోహం చేస్తూ కొన్ని కోట్ల రూపాయిలతో నిర్మాణం జరిగిన ఒక సినిమాని ఆ సినిమా విడుదలైన మరుసటి రోజే తమ సైట్ లో ప్రసారం చేసే సైట్ ఐ బొమ్మ. హీరోలకి కోట్ల కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి ఫారిన్ లో సినిమా తియ్యడమే కాకుండా టికెట్ రేట్లు ని కూడా పెంచి ప్రజల మీద భారం మోపుతున్నారని మీకు బుద్ది రావాలనే పైరసీ చేస్తున్నామని ఐ బొమ్మ వాళ్ళు గతంలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. ఇంకో అడుగు ముందుకేసి మేము ప్రజలకి న్యాయం చేస్తున్నాం అనే లెవెల్లో కూడా ఐ బొమ్మ చెప్పింది. ఇప్పుడు ఒక డైరెక్టర్ మీరు చేసేది తప్పంటూ ఐ బొమ్మ కి ఛాలెంజ్ విసురుతున్నాడు.

ఎన్నో విభిన్నమైన చిత్రాలని తెరకెక్కించిన రాజ్ మాదిరాజు తాజాగా కృష్ణ రామ అనే సినిమా ని తెరకెక్కించాడు. ఈ సినిమా థియేటర్ల లో కాకుండా డైరెక్ట్ గా ఈటీవీ విన్ లో రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా ఐ బొమ్మ సైట్ లో ప్రత్యక్ష మయ్యింది. దీనిపై సీరియస్ అయిన రాజ్ ముదిరాజు ఐ బొమ్మ కి ఒక నోట్ రిలీజ్ చేసాడు. మా కృష్ణ రామ సినిమా కథ ఎక్కడ నుంచి కాపీ కొట్టింది కాదు మేము సొంతంగా తయారు చేసుకున్న కథ. సినిమా షూటింగు మొత్తాన్ని హైదరాబాద్ లోనే కంప్లీట్ చేసాం. ఇంటిల్లిపాది మా సినిమాను వంద రూపాయలకే చూడాలనే ఉద్దేశంతో థియేటర్లలో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఈటీవీ విన్ ద్వారా రిలీజ్ చేసాం. మా సినిమాలో కోట్లు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే పెద్ద పెద్ద హీరోలు లేరు. మరి ఎందుకు మీ ఐ బొమ్మ సైట్లో మా సినిమాని ఉంచారని మాదిరాజు ప్రశ్నిస్తున్నాడు.

నిజానికి నేను తీసిన సినిమా ఎక్కువ సైట్లలో కనిపిస్తే ఒక దర్శకుడుగా నాకే ఉపయోగం.కానీ ఈటీవీ విన్ సబ్‌స్క్రైబ్ చేసుకుని సినిమా చూస్తే మా నిర్మాతలకు పెట్టిన డబ్బు తిరిగొచ్చి ఇంకొన్ని మంచి సినిమాలు తీస్తారు. దాంతో ఇంకొంత మందికి పని దొరుకుతుంది. అలాగే మీ సైట్ లో కనిపిస్తున్న సినిమాలలో సగానికి పైగా చిన్నా చితకా సినిమాలే. ఇప్పుడు చెప్పండి బ్రదర్ నీతికోసం పేదవాడికోసం నిజాయితీగా నిలబడే రాబిన్‌హుడ్ లా పోజులు కొడుతున్న మీకు ఎందుకు ఈ హిపోక్రసీ మీరు చేసేది ఒక రేప్ లాంటిదని కొంచెం ఘాటైన విధంగానే మాదిరాజు ఐ బొమ్మ వాళ్లకి ప్రశ్నలు వేస్తున్నాడు. మీరు ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మీకు పైరసీ వాళ్ళ కలిగే నొప్పి తెలుస్తుందని పెద్ద సినిమాల విషయంలో కూడా మీరు చేసేది తప్పే అని ఇంకో సారి వివరంగా చెప్తానని ఐ బొమ్మ కి కొంచెం గట్టిగానే మాదిరాజు వార్నింగ్ ఇచ్చాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం