English | Telugu

రాధిక అలా ఎందుకు క‌వ‌ర్ చేయాల్సి వ‌చ్చింది?

రాధికా ఆప్టే న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ - కామెడీ సినిమా మిసెస్ అండ‌ర్‌కవ‌ర్‌. ఇందులో ఆమె గృహిణిగానూ, అండ‌ర్ క‌వ‌ర్ ఏజెంట్‌గానూ క‌నిపిస్తారు. స్పై కామెడీ చిత్ర‌మిది. ఇందులో రాధిక ఆప్టే పేరు దుర్గ‌. అండ‌ర్ క‌వ‌ర్ ఆఫీస‌ర్‌గా ఉన్న ఆమె ప‌దేళ్ల పాటు వృత్తికి దూర‌మ‌వుతుంది. పెళ్లి చేసుకుని ఇల్లాలిగా మారుతుంది. ఆమెను డ్యూటీకి పిలుస్తారు. పెళ్ల‌య్యాక అన్నిటినీ మ‌ర్చిపోయాన‌ని భావిస్తుంది దుర్గ‌. ఇప్ప‌టికిప్పుడు డ్యూటీలో పార్టిసిపేట్ చేయాలంటే క‌ష్ట‌మైన ప‌నేన‌ని అనుకుంటుంది. ద‌శాబ్దం పాటు ఇల్లాలిగా చేశాక‌, ఇంకేం చేయ‌లేన‌ని ఫిక్స్ అవుతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

ఈ ప్రాజెక్ట్ గురించి 37 ఏళ్ల రాధికా ఆప్టే మాట్లాడుతూ ``నా కెరీర్‌లో మిసెస్ అండ‌ర్‌క‌వ‌ర్ చాలా స్పెష‌ల్‌. దానికి చాలా కార‌ణాలున్నాయి. స్పై కామెడీ జోన‌ర్‌లో ఉంద‌న్న‌ది మాత్ర‌మే కాదు. నా కేర‌క్ట‌ర్ కేక పుట్టిస్తుంది. ఫ‌స్ట్ నెరేష‌న్‌లోనే నాకు కేర‌క్ట‌ర్ పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చింది. దుర్గ కేర‌క్ట‌ర్ చాలా ఫ‌న్నీగా ఉంటుంది. ద‌య‌తో ప్ర‌వ‌ర్తిస్తుంది. ప‌నుల్లో సిన్సియారిటీ ఉంటుంది. కొన్నిసార్లు తిక‌మ‌క‌గా ప్ర‌వ‌ర్తిస్తుంది. కొన్నిసార్లు అస‌లు త‌నేం చేస్తుందో కూడా త‌న‌కు అర్థం కాదు. త‌న బ‌లాన్ని తాను ఐడెంటిఫై చేసుకోవ‌డ‌మే ఈ సినిమాలో కోర్ పాయింట్‌`` అని చెప్పారు.

ఈ సినిమాతో ప్ర‌తి మహిళ ఏదో పోల్చి చూసుకుంటుంది. ఇల్లాలుగా మారిన ప్ర‌తి మ‌హిళ‌లోనూ అంత‌ర్గ‌త నైపుణ్యం ఏదో ఉంటుంది. దాన్ని త‌ట్టిలేపుతుంది ఈ సినిమా. దీని గురించి రాధిక చెబుతూ ``ప్ర‌తి ఇల్లాలిలోనూ ఓ దుర్గ ఉంటారు. కొన్నిసార్లు పేరుకు ఏదో ఉద్యోగం చేస్తున్నా స‌రే, ఇంకేదో చేయ‌ద‌గ్గ ప్రతిభ వారిలో దాగి ఉంటుంది. పితృస్వామ్య వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శ్నించే అంశాలుంటాయి. ఆద్యంతం న‌వ్విస్తూనే, అస‌లైన విష‌యాల మీద చ‌ర్చ జ‌రుగుతుంది ఈ చిత్రంలో`` అని అన్నారు. అనుశ్రీ మెహ‌తా ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుమీత్ వ్యాస్‌, రాజేష్ శ‌ర్మ‌, సాహెబ్ చ‌ట‌ర్జీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.