English | Telugu

ది 100 అనే మూవీ రియల్ స్టోరీ.. ఒక పోలీసు చెప్పిన కథ..

ఆర్కె. నాయుడు నటించిన ది 100 అనే మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రొమోషన్స్ కోసం ఆర్కె. నాయుడు సుమ చాట్ షోకి వచ్చ్రు. " మొగలి రేకులు సీరియల్ చేసేటప్పుడు నాకు చాలామంది పోలీసుల దగ్గర నుంచి కాల్స్ వచ్చేవి. నాకు దాదాపు ఒక 100 కాప్స్ రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళతో ఉండడం వలన నాకు తెలియకుండానే నా లైఫ్ లో నేనొక రియల్ కాప్ లా గడిచిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఇప్పుడు ది 100 అనే మూవీ ఒక రియల్ స్టోరీ. ఇది ఒక కాప్ చెప్పిన స్టోరీ. ఎస్డి.గౌతమ్ అని ఒక ఇన్సిడెంట్ చెప్పారాయన.

ఆ స్టోరీ విన్నప్పుడు నిజంగా ఇది జరిగిందా అన్న డౌట్ వచ్చింది. అప్పుడు ఆయన కొంతమంది విక్టింస్ ని చూపించేసరికి ఈ కంటెంట్ ని ఎప్పటినుంచో చేద్దామనుకుంటూ ఉన్నాను. పుష్ప కంటే ముందు నేను సుకుమార్ గారి ఇంట్లో కూర్చుని డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి అడిగాను. అప్పుడు ఈ ఇన్సిడెంట్ చెప్పను. ఇంత మంచి స్టోరీ పెట్టుకుని ఎక్కడో వెతుకుతావేంటి అన్నారు. ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తమ్ముడు డైరెక్టర్ వేణు శ్రీరామ్ విని ఇది చేస్తే బాగుంటుంది అన్నారు. అలా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. నేను ఈ స్టోరీని ఎప్పుడైనా ఫ్రెండ్స్ మధ్యలో కూర్చున్నప్పుడు చెప్తే అందరికీ కన్నీళ్లు వచ్చేసేవి. దాంతో అప్పుడే అనుకున్న ఈ సినిమాని కచ్చితంగా చేయాలి అని. ఐతే మొగలిరేకులు ఐపోయాక ఇక పోలీస్ క్యారెక్టర్స్ చేయకూడదు అనుకున్నా. ఒక వేళా చేస్తే గుర్తుండిపోయేలా చేయాలి అనుకున్నా. ఈ మూవీలో కాప్ రోల్ అలాగే ఉంటుంది. " అని చెప్పుకొచ్చారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.