English | Telugu

ఒక్క నిర్ణయం.. 'పుష్ప-2' కలెక్షన్స్ మరింత పెరగనున్నాయా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా 'పుష్ప-2' ఫీవరే కనిపిస్తోంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన పుష్ప-2.. సంచలన వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.829 కోట్ల గ్రాస్ రాబట్టింది. త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరనుంది. ఈ వసూళ్ల జోరుని మరింత పెంచేలా 'పుష్ప-2' టీం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. (Pushpa 2 The Rule)

తెలంగాణలో 'పుష్ప-2' ప్రీమియర్ షోలకు రూ.800 వరకు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అలాగే మొదటి నాలుగు రోజులు సింగిల్ స్క్రీన్స్ లో రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.200 పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఇక డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్ లో రూ.105, మల్టీప్లెక్స్ లలో రూ.150 పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఈరోజు(డిసెంబర్ 9) నుంచి టికెట్ ధరలను తగ్గించింది పుష్ప టీం. ప్రస్తుతం టికెట్ బుకింగ్ సైట్స్ లో చూస్తే.. సింగిల్ స్క్రీన్స్ లో రూ.200, మల్టీప్లెక్స్ లలో రూ.400 గా టికెట్ రేట్లు చూపిస్తున్నాయి.

తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఉంది. అయితే ఏపీలో కూడా వైజాగ్ లో తప్ప మిగతా అన్ని చోట్ల సింగిల్ స్క్రీన్స్ లో రూ.200, మల్టీప్లెక్స్ లలో రూ.300 గా టికెట్ ధరలు ఉన్నాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అనుమతి లభించిన ధర కంటే తక్కువగానే పుష్ప-2 టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

అధిక ధరలు ఉన్నప్పటికీ 'పుష్ప-2' సినిమాని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అందుకే మొదటి నాలుగు రోజులు ఆ స్థాయి వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలనేకువారు, ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి వెళ్లాలనుకునేవారు.. టికెట్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే, పుష్ప టీం టికెట్ ధరలను తగ్గించినట్లుంది. ఈ నిర్ణయం వల్ల సినిమా చూసే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అదే జరిగితే వసూళ్ల పరంగా పుష్ప-2 మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.