English | Telugu

'పుష్ప-2' రన్ టైం తెలిస్తే షాక్.. తెరవెనుక అసలేం జరుగుతోంది?

దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న 'పుష్ప-2' చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే విడుదలకు ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు. కానీ ఇంతవరకు ఫైనల్ కాపీ రెడీ కాలేదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్నాయి. దీంతో అసలు ఈ సినిమా అనుకున్న తేదీకి వస్తుందా లేదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని డిసెంబర్ 1 నాటికి ఫైనల్ కాపీ రెడీ అవుతుందని తెలుస్తోంది. (Pushpa 2 The Rule)

'పుష్ప-2' పెండింగ్ షూట్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. చివరి సాంగ్ తో నవంబర్ 30 నాటికి అల్లు అర్జున్ తన పార్ట్ షూట్ మొత్తం పూర్తి చేయనున్నాడు. డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే రఫ్ ఎడిట్ చేయించాడని, నిడివి 3 గంటల 15 నిమిషాలు వచ్చిందని సమాచారం. మొత్తం వర్క్ పూర్తయ్యి, ఫైనల్ ట్రిమ్ అయ్యాక నిడివి కొంత తగ్గే అవకాశముంది. మరోవైపు డిసెంబర్ 1 నాటికి పుష్ప-3 లీడ్ సీన్ షూట్ తో పాటు, అన్ని భాషల డబ్బింగ్ వర్క్స్ పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా వేగంగా జరుగుతుంది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన 90 శాతం స్కోర్ చేసేశాడు. సామ్ సిఎస్, అజనీష్ లోకనాథ్, థమన్ మిగతా స్కోర్ పూర్తి చేసేలా పనిలో ఉన్నారు. మేకర్స్ కోరిక మేరకు, క్షణం తీరిక లేకుండా టీం అంతా కలిసి డిసెంబర్ 1 నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా శక్తికి మించి పని చేస్తున్నారట.