English | Telugu

పవన్ కళ్యాణ్‌ హీరోగా పురుషః... ఫస్ట్ లుక్ అదిరింది..!

వైఫ్ వర్సెస్ వారియర్, వైఫ్ వర్సెస్ పీస్ మ్యాన్, వైఫ్ వర్సెస్ సిజర్ మ్యాన్ అంటూ వరుసగా ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనక ఓ ఆడది ఉంటుంది, స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం.. గొప్ప గొప్ప యుద్ధాలన్నీ భార్యతోనే.. అంటూ క్యాప్షన్స్ పెట్టి.. ప్రీ లుక్ పోస్టర్లతో ఆసక్తిని పెంచింది ‘పురుషః’ చిత్రయూనిట్. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు తన తనయుడు పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుషః’. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్న పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ పాత్రల స్వభావం, వాటి తీరుని ప్రతిబింబించేలా పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ పోస్టర్ మీద ‘బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది..’ ఉన్న కంటెంట్‌ను చూస్తే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది. పోస్టర్ రిలీజ్ చేసిన అనంతరం శ్రీకాంత్ ఓదెల "పురుషః" చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఈ కామెడీ బేస్డ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్‌లతో పాటుగా వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్‌గా రానున్న ఈ సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

ఆద్యంతం అందరినీ అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం