English | Telugu

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

-ఈ కలెక్షన్స్ నిజమేనా!
-ఎంత వచ్చాయి.
-సినిమా పరిస్థితి ఏంటి


శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.


ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదటి రోజు యాభై లక్షల రూపాయలు గ్రాస్ ని సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మేకర్స్ అయితే కలెక్షన్స్ వివరాలని ఇంకా అధికారంగా వెల్లడి చేయలేదు.ఇక మూవీ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు సిద్దార్ధ గా నందు తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసాడని, సదరు క్యారెక్టర్ ని చూస్తుంటే పగ వాడికి కూడా సిద్ధార్ధ కి వచ్చిన బాధ రాకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక శంబాల, ఛాంపియన్ చిత్రాలు స్టిల్ ఇప్పటికి మంచి వసూళ్లతో దూసుకెళ్తున్నాయి. దీంతో వీకెండ్ లో సైక్ సిద్దార్ధ్ ఏ మేర కలెక్షన్స్ ని రాబడతాడో చూడాలి.


Also Read:ఇరవై ఇదే వేలు ఇస్తే ఏమైనా చేస్తుందా! అసలు ఆట అప్పుడే అయిపోలేదు


సుమారు ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టుగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్న సైక్ సిద్ధార్ధ 800 స్క్రీన్స్ లో విడుదలైంది. శ్రావ్య క్యారక్టర్ లో యామిని భాస్కర్(Yamini Bhaskar)త్రిష గా చేసిన ప్రియాంక రెబకా(Priyanka Rebekah)కూడా నందుకి దీటుగా మంచి పెర్ ఫార్మ్ ప్రదర్శించారు. వరుణ్ రెడ్డి(Varun Reddy)దర్శక ప్రతిభ, సాంగ్స్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైక్ సిద్దార్ధ కి ప్రధాన బలంగా నిలిచాయి. స్పిరిట్ మీడియా తో కలిసి నందు నే నిర్మించగా, రానా దగ్గుబాటి థియేటర్స్ లో తీసుకు రావడం జరిగింది.


బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం