English | Telugu

మీ అందరినీ నిరాశపరిచినందుకు సారీ.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత నాగవంశీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా తెలుగునాట ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. అలాగే నాగవంశీ నిర్మించిన గత చిత్రం 'కింగ్డమ్' కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఈ వరుస షాక్ లతో నాగవంశీ డిప్రెషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఫోన్ స్విచాఫ్ చేశారని, దుబాయ్ వెళ్లిపోయారని, సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండనున్నారని.. ఇలా రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే ఒక ట్వీట్ తో ట్రోలర్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు నాగవంశీ.

"ఏంటి నన్ను చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. వంశీ అది, వంశీ ఇది అని ఆసక్తికర కథనాలతో ఫుల్ హడావిడి నడుస్తుంది. పర్లేదు, ఎక్స్(ట్విట్టర్)లో మంచి రైటర్స్ ఉన్నారు. మీ అందరినీ నిరాశపరిచినందుకు క్షమించండి. ఇంకా ఆ టైం రాలేదు. కనీసం ఇంకో 10-15 ఏళ్ళు ఉంది. ఎల్లప్పుడూ సినిమాతోనే ఉంటాను. త్వరలోనే 'మాస్ జాతర' సినిమాతో మీ అందరినీ కలుస్తాను." అని నాగవంశీ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. "నాగవంశీ సినిమాలు వదిలేశారు, దుబాయ్ వెళ్లిపోయారు" అంటూ జరుగుతున్న ప్రచారాలకు ఒకే ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.