English | Telugu
హ్యాపీ బర్త్‌డే - ప్రియమణి
Updated : Jun 4, 2014
నవ్వు ప్రియం
నువ్వు ప్రియం
నయనాలు ప్రియం
నీ నటన ప్రియం
నటీమణుల్లో నువ్వే మణి మయం
కేరళలో పుట్టి
ప్రియ వసుదేమ మణి అయ్యర్
నుంచి
ప్రియమణిగా
2003లో తెలుగు తెరపై
ఎవరే అతగాడితో పరిచయమై
అటు నుంచి దక్షిణాది చిత్రసీమలో ప్రియమైన నటిగా మారి
ఉత్తమ జాతీయ నటిగా అవార్డు గెలుచుకుంది.
వచ్చిన మూడేళ్లకే, 2006లో పురుత్తివీరణ్ తమిళ చిత్రంలో నటించి
జాతీయస్థాయి ఉత్తమ నటన ప్రదర్శించింది.
బాలీవుడ్ బాద్‌షాతో రావన్, చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రాల్లో నటించి దేశమంతా అభిమానుల్ని సంపాదించుకుంది.
ప్రేక్షకుల మనసులో ప్రియమైన హీరోయిన్‌గా స్థానం సుస్థిరం చేసుకున్న ప్రియమణికి తెలుగువన్ తరపున హ్యాపీ బర్త్‌డే