English | Telugu

'సలార్' కొత్త పోస్టర్.. అరాచకం!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సలార్' మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో సంచలనం సృష్టించగల సినిమా అని బలంగా నమ్ముతున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ చిత్రం ఓ పవర్ ఫుల్ పోస్టర్ విడుదలైంది.

'సలార్'లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే సలార్ నుంచి ప్రభాస్ పోస్టర్స్ తో పాటు ఆద్యగా శృతి హాసన్, రాజమన్నార్ గా జగపతి బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ విడుదలై ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాజమన్నార్ గా జగపతి బాబు లుక్ క్రూరంగా, పవర్ ఫుల్ గా అనిపించింది. అయితే ఇప్పుడు అంతకుమించిన క్రూరత్వం పృథ్వీరాజ్ లుక్ లో కనిపిస్తోంది.

నేడు(అక్టోబర్ 16) పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. వర్ధరాజ మన్నార్ గా పృథ్వీరాజ్ లుక్ క్రూరంగా ఆకట్టుకునేలా ఉంది. పేర్లని, ఆహార్యాన్ని బట్టి చూస్తే ఇందులో జగపతిబాబు కొడుకుగా పృథ్వీరాజ్ కనిపించనున్నారని అర్థమవుతోంది. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2023 న ప్రేక్షకుల ముందుకు రానుంది.