English | Telugu
ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..L2 రిజల్ట్ వచ్చేసిందా!
Updated : Mar 22, 2025
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(MOhanlal)అప్ కమింగ్ మూవీ L2 ఎంపురాన్(L2 empuraan).2019 లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతుండంతో అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి.మరో ప్రముఖ మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 27 న విడుదల కాబోతుంది.ఇటీవల రిలీజైన తెలుగు ట్రైలర్ ఒక రేంజ్ లో ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా L2కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ L 2 ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.వాటిల్లో మోహన్ లాల్,పృథ్వీ రాజ్ సుకుమారన్ పాల్గొని మూవీకి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.ఈ సందర్భంగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పృథ్వీ రాజ్ సుకుమారన్ మాట్లాడుతు మోహన్ లాల్ సర్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు.ఆయన వల్లే ఈ సినిమా తెరకెక్కింది.ఒక దర్శకుడిగా నేను నిర్మాతల గురించి ఆలోచిస్తాను.దాంతో మనం తీసుకున్నప్రతి రూపాయికి న్యాయం చెయ్యాలనుకుంటాను.మోహన్ లాల్ సర్ ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు.ఆయన పారితోషకాన్ని కూడా ఈ సినిమా కోసమే ఖర్చుపెట్టాం.స్క్రీన్ పై ఆ విషయం స్పష్టంగా తెలుస్తుందని చెప్పుకొచ్చాడు.
మోహన్ లాల్ కూడా మాట్లాడుతు మలయాళ చిత్ర పరిశ్రమకి వచ్చి 47 ఏళ్ళు అవుతుంది. ప్రజల అభిమానంతోనే ఇన్నాళ్ల నుంచి పరిశ్రమలో ఉండగలుగుతున్నాను.మలయాళ భాష మీద అభిమానంతోనే వేరే భాషలో ఎక్కువ సినిమాలు చెయ్యాలనుకోలేదు.ఎంపురాన్ అందర్నీ అలరిస్తుందని చెప్పుకొచ్చాడు.