English | Telugu
పోసానికి బెయిల్ వచ్చేసింది..నాలుగు షరతులు వింటే చుక్కలే
Updated : Mar 22, 2025
ప్రముఖ సినీ రచయిత,దర్శకుడు,నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali)గత వైసిపీ ప్రభుత్వంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(chandrababu naidu)ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఏపి వ్యాప్తంగా పదహారు ఏరియాల్లో పదహారు కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 26 న ఏపి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలతో అయితే పోసాని పై సిఐడి కేస్ నమోదుచేయడంతో గుంటూరు(Guntur)జైల్లో ఉన్న పోసానికి గతంలో బెయిల్ వచ్చినా కూడా రిలీజ్ కావడానికి కుదరలేదు .
కానీ రీసెంట్ గా పోసానికి అన్ని కేసులకు సంబంధించి రెండులక్షల ష్యురీటి,ఇద్దరి సంతకాలతో పాటు,నాలుగు షరతులతో కూడిన బెయిల్ ని గుంటూరు కోర్టు మంజూరుచేసింది.ఆ నాలుగు షరతుల్లో మొదటగా దేశాన్ని విడిచి వెళ్ళకూడదు.రెండోది చంద్రబాబు నాయుడుపై మాట్లాడిన మాటలపై నమోదైన కేసు కాబట్టి ఆ కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదు.మూడోది నాలుగు వారాల పాటు ప్రతి మంగళ,గురువారాల్లో మంగళగిరి లో ఉన్న సిఐడి ఆఫీస్ కి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో వచ్చి సంతకాలు పెట్టాలి,నాలుగోది కేసు విచారణకి సహకరించాలి.ఇలా నాలుగు షరతులతో కూడిన బెయిల్ ని కోర్టు మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు రాగానే పోసాని భావోద్వేగానికి గురయ్యాడు.