English | Telugu

బిగ్ బాస్ కి షాక్.. షో ఆపేయ్యాలంటూ ప్రభుత్వం నోటీసులు 

స్మాల్ స్క్రీన్ పై ప్రదర్శమయ్యే ఎంటర్ టైన్మెంట్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ లో 'బిగ్ బాస్'(Big Boss)షో కి ప్రత్యేకమైన స్థానం ఉంది. దాదాపుగా ఇండియాలోని అన్ని లాంగ్వేజ్ లలో బిగ్ బాస్ షో ప్రదర్శితమయ్యి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం పలు భాషల్లో పలు సీజన్లు రన్ అవుతున్నాయి. ఈ షో ఇప్పుడు మన తెలుగులో 'నాగార్జున'(Nagarjuna)హోస్ట్ గా టెలికాస్ట్ అవుతున్న అవుతున్న విషయం తెలిసిందే. కన్నడ లో 'కిచ్చా సుదీప్'(Kiccha sudeep)హోస్ట్ గా నూతన సీజన్ సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమైంది. బెంగుళూరు(Bengaluru) శివారులోని బిడడి హొబ్లీ లోని జోలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్ లో బిగ్ బాస్ హౌస్ ఉంది.


ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ హౌస్ కి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆద్వర్యంలోని కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసు జారీ చేసింది. అధికారుల నివేదిక ప్రకారం హౌస్ నుంచి శుద్ధి చెయ్యని మురుగునీటిని సెట్ వెలుపల విడుదల చేస్తున్నారు. దీని వాళ్ళ పర్యావరణ కాలుష్యం కలుగుతుంది. సెట్ దగ్గరలో 250 కె ఎల్ డి సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసారని బిగ్ బాస్ నిర్మాణ బృందం పేర్కొన్నప్పటికీ సరైన అంతర్గత డ్రైనేజి కలెక్షన్స్ లేవని, ఎస్ టి పి యూనిట్ల నిర్మాణం సరిగా లేదని అధికారులు చెప్తున్నారు. తనిఖీలో ప్లాస్టిక్ కప్పులు, పేపర్ ప్లేట్ లు, ఇతర డిస్పోజబుల్స్ వంటి వాటిని బహిరంగంగానే పడేసారని కూడా గుర్తించారు.

అదనంగా 625 , 500 కెవిఏ కెపాసిటీ తో కూడిన డీజిల్ జనరేటర్ సెట్ లు ఏర్పాటు చేసారు. ఇది మరింత పర్యావరణ ఆందోళన కలిగిస్తుందని, కాబట్టి బిగ్ బాస్ షో ని ఆపివేయాలని కర్ణాటక కాలుష్య బోర్డు ఆదేశించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాతో పాటు కన్నడ మీడియాలో వైరల్ గా మారింది. .

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.