English | Telugu

కనుమరుగుకాకూడదనే వచ్చాను.. సిఎం కి ఆయన పేరుని ప్రతిపాదించాను 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'(Harihara Veeramallu)పార్ట్ 1 ఈ నెల 24 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ముందు రోజు ప్రీమియర్ షోస్ కూడా ప్రదర్శిస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవన్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో సందడి నెలకొని ఉంది. 'నిధి అగర్వాల్'(Nidhhi Agerwal)హీరోయిన్ గా చేస్తుండగా అగ్ర నిర్మాత 'ఏఎం రత్నం'(Am Rathnam)సుమారు ఐదు సంవత్సరాలు కష్టపడి 'వీరమల్లు' ని నిర్మించాడు.

రీసెంట్ గా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశమయ్యింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతు 'నేను సినిమా రిలీజ్ కి ముందు మీడియా సమావేశానికి రావడం చాలా అరుదు. కానీ ఏ ఎం రత్నం గారి కోసం వచ్చాను. నిర్మాతగా ఆయన ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొని 'వీరమల్లు' ని నిర్మించారు. అలాంటి నిర్మాత కనుమరుగు కాకూడదని వచ్చాను. మేకప్ మాన్ గా స్టార్ట్ అయిన రత్నం గారు భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగిన సినిమాలు తెరకెక్కించారు. నాతోనే కాకుండా ఎంతో మంది సూపర్ స్టార్స్ తో సినిమాలు తెరకెక్కించి విజయాలు అందుకున్నారు. అలాంటి వ్యక్తి వీరమల్లు విషయంలో ఇబ్బందులు పడటంతో చాలా బాధపడ్డాను. కానీ ఆయన మాత్రం ఎవర్ని ఏమి అనకుండా మౌనంగా ఉంటారు. ఏఎం రత్నం గారిని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించాలని 'ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు' గారికి నేను ప్రతిపాదించాను.

సినిమా నాకు ప్రాణ వాయువు, అన్నం పెట్టింది. ఇక్కడ నేనైనా, రేపు నా కొడుకు వచ్చినా టాలెంట్ లేకపోతే ఎవ్వరు నిలబడ్డారని పవన్ చెప్పుకొచ్చాడు. దర్శకుడు జ్యోతికృష్ణ(Jyothi Krishna) నిధి అగర్వాల్, ఏఎంరత్నం కూడా మాట్లాడుతు వీరమల్లు తప్పకుండా విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఔరంగజేబుగా కనిపిస్తుండగా, నర్గిస్ ఫక్రి, నోరా ఫతే హి, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.కీరవాణి(Keeravani)సంగీతంలో వచ్చిన అన్ని పాటలు ప్రస్తుతం మారుమోగిపోతున్నాయి. పవన్ తన కెరీర్ లో చేస్తున్న మొట్టమొదటి చారిత్రాత్మక మూవీ వీరమల్లునే. ఈ రోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.