English | Telugu
పవన్ కళ్యాణ్ కి రేవంత్ రెడ్డి ఇంట్లో సన్మానం
Updated : Sep 11, 2024
ఇటీవల కురిసిన భారీ వర్షాలకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan) తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలని విరాళంగా ప్రకటించాడు.ఇప్పుడు ఈ పని మీదే హైదరాబాద్ రావడం జరిగింది.
జూబ్లీహిల్స్ లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)ఇంటికి వెళ్లిన పవన్ స్వయంగా రేవంత్ రెడ్డి కే కోటి రూపాయల చెక్ ని అందించాడు.అనంతరం పవన్ ని శాలువాతో పాటు పుష్ప గుచ్చం తో రేవంత్ సత్కరించారు.ఒక నంది బొమ్మ ని కూడా బహుకరించడం జరిగింది. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాసేపు ఇద్దరు పలు విషయాల మీద కూడా చర్చించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ వెంట పలువురు జనసేన నాయకులతో పాటు కొంత మంది కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి ని కలిశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి సహాయ నిధికి కూడా పవన్ కోటి రూపాయలని ప్రకటించడంతో పాటు మొత్తం నాలుగు వందల పంచాయితీలకి లక్ష చొప్పున నాలుగు కోట్లు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.