English | Telugu

స్టార్ రైటర్ పై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్!

సినిమా పరిశ్రమలో అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. ఎవరి పరిస్థితి ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి సమయంలో వారు వరుస విజయాలలో ఉంటే అహంకారం చూపిస్తారు. వ‌రుస ప‌రాజయాలు ఎదురైతే కాళ్లు పట్టుకుంటారు. ఈ కోవలోకి చాలామంది వస్తారు. వారిలో కోన వెంకట్ కూడా ఒకరు. ఈయ‌న‌ది చాలా పెద్ద ఫ్యామిలీ. కోన ప్రభాకరరావు ఒకప్పుడు పెద్ద పొలిటీషియన్. ఎమ్మెల్యేగా, మంత్రిగా పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు.

ఇక కోనా వెంకట్ విషయానికి వస్తే ఈయన శ్రీను వైట్లతో కలిసి పలు సూపర్ హిట్ సినిమాలు కు కలిసి పనిచేశారు. నాడు కోన వెంక‌ట్ కు జోడీగా గోపి మోహన్ ఉండేవారు. ఆ తరువాత వీరు శ్రీనువైట్ల నుంచి దూరంగా జరిగారు. ఇటీవల మంచు విష్ణు జిన్నాతో కోన వెంకట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఆయన తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యతో మళ్ళీ లైన్ లోకి వచ్చేసారు. బాబి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కోన వెంకట్ తో పాటు చక్రవర్తి రెడ్డి కూడా పనిచేశారు. అంటే గోపి మోహన్ స్థానంలో చక్రవర్తి రెడ్డి వచ్చి చేరారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 200 కోట్లను వసూలు చేసింది. ఆ క్రేజ్ తో ఉన్న కోన వెంకట్ ఇదే జోష్ లో మరిన్ని సినిమాలకు పని చేయబోతున్నారు.

పవన్ నటిస్తున్నOG చిత్రం ఓపెనింగ్ లో కోన సందడి చేశారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే క్యాప్ష‌న్ తో రూపొందుతున్న ఈ మూవీని డివివి దానయ్య పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్నారు. పంజా చిత్రం తరహాలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న కోన వెంకట్ పవన్ కళ్యాణ్ తో సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో పవన్ నా సోల్మెట్ అని స్టేట్మెంట్ ఇచ్చిన వెంకట్ ఆ తర్వాత వైసీపీకి చెందిన మీడియాలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ పవన్ కళ్యాణ్ పై అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి కోనా ఇప్పుడు మరలా పవన్ పక్కన చేరడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు.

కోన మొదటి నుంచి వైసీపీ వీరాభిమాని. ఆయన తండ్రి తాతయ్యలు కాంగ్రెస్ వాదులు. కోన వెంక‌ట్ వైసీపీ సానుభూతిపరుడు. ఈయ‌న గతంలో ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించి ఇప్పుడు పవన్ పంచన ఎలా చేరుతాడని సోషల్ మీడియాలో వేదికగా కోనపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన ఫోటోలకు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. తమ కామెంట్లతో వరుసగా అభిమానులు ఆయనపై విరుచుకుపడుతున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.