English | Telugu

ఆస్కార్ అవార్డ్స్ లో గ్యాంబ్లింగ్.. తెలుగువారు మిమ్మల్ని ఆదరించారని మర్చిపోకండి  

-పరేష్ రావెల్ సంచలన వ్యాఖ్యలు
-ఆస్కార్ అవార్డ్స్ లో లాబీయింగ్
-తెలుగు వారికి అభిమాన నటుడు

భారతీయ సినీ రంగంలోని లెజండ్రీ నటుల ప్రస్తావనకి వచ్చినప్పుడు అందులో 'పరేష్ రావెల్'(Paresh Rawal)పేరు ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు చిత్ర ప్రేమికులకి కూడా సుదీర్ఘ కాలం నుంచి పరిచయమే. ముఖ్యంగా మనీ, గోవిందా గోవిందా, శంకర దాదా ఎంబిబిఎస్ వంటి చిత్రాల్లోని నటనతో అయితే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా నిలిచిపోయాడు. కొంత కాలం గ్యాప్ తర్వాత రీసెంట్ గా రష్మిక, ఆయుష్మాన్ ఖురానా ల 'థామా'(Thamma)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సత్తా చాటాడు.

రీసెంట్ గా పరేష్ రావెల్ చిత్ర పరిశ్రమకి సంబంధించి ఇచ్చే అవార్డ్స్ గురించి మాట్లాడుతు నా వరకైతే అవార్డ్స్ కంటే ప్రేక్షకులు, నిర్మాత, దర్శకుడు ఇచ్చే ప్రశంసలు ముఖ్యమైనవి. ఎందుకంటే అవార్డ్స్ విషయంలో లాబీయింగ్ జరిగే అవకాశం ఉంది. ఇతర పురస్కారాలతో పోలిస్తే జాతీయ అవార్డ్స్ విషయంలో లాబీయింగ్ ఎక్కువ. ఆస్కార్ అవార్డ్స్ లో కూడా అలా జరిగే అవకాశం ఉంది. చిత్ర బృందం, నెట్ వర్క్, కొన్ని పార్టీల ద్వారా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. నిర్మాతలు జ్యురి సభ్యుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఇది పలానా దర్శకుడు సినిమా అని ఒక్కోసారి ప్రత్యేక శ్రద్ధ చుపిస్తారంటు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. పరేష్ రావెల్ లాంటి లెజండ్రీ యాక్టర్ అవార్డ్స్ గురించి ఆ రకంగా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:వాళ్ళ పేర్లు చెబితే నన్ను చంపేస్తారు. రష్మిక వ్యాఖ్యలు వైరల్!


1985 లో సన్నీడియోల్ హీరోగా వచ్చిన 'అర్జున్' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన పరేష్ రావెల్ తన కెరీర్ లో మొత్తం 240 చిత్రాల వరకు నటించాడు. సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న తన కెరీర్ లో ఎన్నో అవార్డ్స్ ని అందుకున్న పరేష్ రావెల్ రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. 2014 లో భారతీయ జనతా పార్టీ తరుపున గుజరాత్ లోని అహ్మదాబాద్ ఈస్ట్ నుంచి ఎంపి గా గెలుపొందాడు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ వంటి పురస్కారాన్ని సైతం అందుకున్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం