English | Telugu

ఎన్టీఆర్ ఏంట‌య్యా ఇదీ...?!

ఇంకో నాలుగు రోజుల్లో టెంప‌ర్ రిలీజ్‌! కానీ ఈ సినిమాపై ఉన్న చిక్కుముడులు ఇంకా వీడ‌లేదు. బండ్ల గ‌ణేష్ ఈ సినిమాని పీవీపీకీ, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌కీ అప్ప‌గించి ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి మెల్లి మెల్లిగా బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తోంటే, అవి ఇంకా ముదిరి ముదిరి పీక్‌కి చేరాయి. ఆఖరికి ఈ సినిమా విడుద‌ల‌పై నీలినీడ‌లు క‌మ్ముకొనేలా చేశాయి. ఈరోజో, రేపో సెన్సార్ అన‌గా.. ఈ సినిమాకి కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. ఈసారి స్వ‌యంగా ఎన్టీఆర్ వ‌ల్ల‌. త‌న‌కు రావ‌ల్సిన పారితోషికం ఇస్తేగానీ డ‌బ్బింగ్ చెప్పేది లేద‌ని ఎన్టీఆర్ భీష్మించుకొని కూర్చున్నాడ‌ని టాలీవుడ్ లో ఓ టాక్ మొద‌లైంది. చివ‌రి నాలుగు రీళ్లూ ఎన్టీఆర్ డ‌బ్బింగ్ చెప్ప‌కుండా వ‌దిలేశాడ‌ట‌. డ‌బ్బులిస్తేనే డ‌బ్బింగ్ అంటూ రూలు పెట్టాడ‌ట‌. దాంతో బండ్ల గ‌ణేష్ బెంబేలెత్తిపోయాడు. ఎన్టీఆర్ కాళ్లా వేళ్లా ప‌డినా... క‌నిక‌రించ‌లేద‌ని తెలిసింది. ఆఖ‌రికి పీవీపీ లాంటి సంస్థ హ‌మీ ఇచ్చినా ఎన్టీఆర్ డ‌బ్బింగ్‌కి రాలేద‌ట‌. దాంతో ఆఘ‌మేఘాల మీద గ‌ణేష్ డ‌బ్బులు సర్దుబాటు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆదివారం సాయింత్రం ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిన బాకీ మొత్తం అంద‌జేశాడ‌ట‌. దాంతో.. ఈ సినిమా డ‌బ్బింగ్ పూర్త‌య్యింది. ఓ స్టార్‌ క‌థానాయ‌కుడు అయ్యుండి.. త‌న సినిమాని చివ‌రి క్ష‌ణాల్లో ఇలా టెన్ష‌న్ పెట్ట‌డం ఏమాత్రం న్యాయం?? అంటూ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంతో గ‌ణేష్ - ఎన్టీఆర్‌ల బంధం.. బెడ‌సి కొట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. ఎన్టీఆర్ నా బాద్ షా అని చెప్పుకొన్న గ‌ణేష్ ఇక‌పై ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌గ‌ల‌డా, గ‌ణేష్ కి వ‌రుస‌గా రెండు అవ‌కాశాలిచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు గ‌ణేష్‌ని త‌న కాంపౌండ్‌లోకి అడుగుపెట్ట‌నిస్తాడా?? అంత సీన్ లేద‌నిపిస్తోంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.