English | Telugu

న‌య‌న‌తార పెళ్లి 'గుట్టు' విప్ప‌బోతోందా?

త‌మిళ‌ దర్శకుడు విఘ్నేష్ శివమ్ తో న‌య‌త తార ప్రేమాయ‌ణం న‌డుపుతోంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మైపోయింది. ఎవ‌రికైనా డౌట్లొస్తే.. ఈమ‌ధ్య న‌య‌న తీసుకొన్న సెల్ఫీ.. ఆ అనుమానాల్ని ప‌టాపంచలు చేసింది. శివ‌మ్ - న‌య‌న హాట్ సెల్పీ.. ఇప్పుడు త‌మిళ సీమ‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సెల్పీ ద్వారా త‌మ మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని న‌య‌న‌తార అంద‌రికీ తెలియ‌ప‌ర్చాల‌నుకొంద‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల వీళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకొన్నార‌న్న వార్త‌లొచ్చాయి. వాటిని ఇద్ద‌రూ ఖండించారు కూడా. అయితే త‌మ‌మ‌ధ్య ఏమీ లేద‌న్న విష‌యాన్ని మాత్రం స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోయారు. త్వ‌ర‌లో త‌మ అనుబంధం గుట్టు మీడియా ముందు విప్పేయాల‌ని న‌య‌న భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకు త‌గిన స‌మ‌యం, వేదిక గురించి ఆలోచిస్తోంద‌ట‌.


ప్ర‌స్త‌తం తిరునాళ్ అనే త‌మిళ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది న‌య‌న‌. కుంభకోణంలోని ఓ బ‌స చేస్తోంది. ఆ హోట‌ల్‌లో శివ‌మ్‌, న‌య‌న పక్క‌ప‌క్క గ‌దుల్లోనే మ‌కాం పెట్టార‌ట‌. ఈ సెల్ఫీ కూడా అక్క‌డ తీసుకొన్న‌దే అని తెలుస్తోంది. బయటికి వచ్చిన మరుసటి రోజు నుంచీ నయనతార కాస్త అస‌హ‌నంగా క‌నిపిస్తోంద‌ట‌. ఓ రోజు షూటింగ్ ని క్యాన్సిల్ చేసేసి హోట‌ల్ రూమ్ లోనే ఉండిపోయింద‌ట‌. ఇక ఎంతో కాలం ఈ ర‌హ‌స్యం దాచ‌డం క‌ష్ట‌మ‌నుకొంటున్న న‌య‌న త్వ‌ర‌లోనే ఈ ర‌హ‌స్యాన్ని బ‌హిర్గ‌తం చేయాల‌నుకొంటుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే న‌య‌న నుంచి పెళ్లి క‌బురు వినొచ్చు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.