Read more!

English | Telugu

బొద్దుగుమ్మ నమితకు పండంటి క‌వ‌ల పిల్ల‌లు!

బొద్దుగుమ్మ నమిత అంటే చాలు 'జెమిని' సినిమా గుర్తొస్తుంది. ఈ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయింది. 'సొంతం' మూవీలో ఎంతో సన్నగా కనిపించిన నమిత తర్వాత బాగా బరువు పెరిగిపోయింది. దీంతో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అలాంటి టైములో ఈ బొద్దు గుమ్మ 2017లో తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. 

ఐదేళ్ల‌కు గ‌ర్భం దాల్చిన న‌మిత‌.. మేలో త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని సోషల్ మీడియాలో తన ఫాన్స్ కోసం రివీల్ చేసింది. నమిత బేబీ బంప్ ఫోటో షూట్స్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె ఇద్ద‌రు మ‌గ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ శుభ‌వార్త‌ను కృష్ణాష్టమి రోజున అందరికీ చెప్పింది.

తాను ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చినట్లు తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది. అంద‌రి బ్లెస్సింగ్స్ త‌న‌ పిల్లల పై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది నమిత. అలాగే తన డెలివరీ టైంలో రేలా హాస్పిటల్ స్టాఫ్ తనకు ఎంతో మంచి సర్వీస్ ని అందించిందని వారికి స్పెషల్ థాంక్స్ చెప్పింది.  ఈ సందర్భంగా తాను తన భర్త చెరో బిడ్డను ఎత్తుకున్న ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. కానీ పిల్లల ముఖాలను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు నమిత. ఈ శుభసందర్భంగా నెటిజన్స్ అంతా నమిత ఫ్యామిలీకి విషెస్ చెప్తున్నారు.