English | Telugu

రామ్ కి నచ్చలేదు..చైతుకి నచ్చింది

నాగ చైతన్య ప్రేమమ్ సినిమా తెగ నచ్చేసిందట. ఆ సినిమాని ఎలాగైన రీమేక్ చేయాలని ఆశ పడుతున్నాడట. ముందుగా ఈ సినిమాని ఎనర్జిటిక్ హీరో రామ్ చేస్తాడని అంతా టాం టాం అయింది. దీనిపై స్పందించిన రామ్ ఆ సినిమా పేరు నాకేం తెలీదు. ఇంకా రీమేకా..? అంటూ గాలి తీసేశాడు. ఇప్పుడు ఆ సినిమా చూసిన అక్కినేని వారి పిల్లగాడు ఎలాగైనా ఈ సినిమా చేసి తీరాలని పట్టుబట్టి కూర్చున్నాడట. చైతూ అంత పట్టు పట్టడానికి కారణం వుంది. మనోడికి కలిసొచ్చింది అక్కినేని మార్క్ ప్రేమకథలే. మాస్ స్టైల్ ఆసలు వర్కౌట్ కాలేదు. ప్రేమమ్ సినిమా రొమాంటిక్ కామెడీ పైగా మలయాళంలో సూపర్ హిట్. అందుకే ఈ సినిమాని తెలుగు తెరకి ఎక్కించి ఓ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడట. అన్నీ కలిసొస్తే చైతూ ప్రేమమ్ తో హిట్ కొట్టడం ఖాయమని ఇండస్ట్రీ టాక్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.